Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!

ఏపీలో ఎన్నికల వేళ సీఎం వైఎస్ జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఒక్క ఆధారం కూడా సాధించలేకపోయారు. అయితే ఊహాజనిత ఆధారాలతో వేముల సతీష్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు పంపారు. అనంతరం కస్టడీకి ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు.

వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీష్ ను కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ పై విచారణ జరిపిన విజయవాడ కోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. సతీష్ ను మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. అయితే పోలీసులు, తల్లి సమక్షంలోనే అతన్ని విచారించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు అతన్ని కస్టడీలో విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

three day police cusody to ys jagan stone attack case accused satish

మరోవైపు ఈ కేసులో బలమైన ఆధారాలను సంపాదించడంలో విఫలమైన విజయవాడ పోలీసులు వేముల దుర్గారావు అనే మరో అనుమానితుడిని గతంలో అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల పాటు విచారించినా కోర్టులో హాజరుపర్చలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని విడిచిపెట్టేశారు. అదే సమయంలో వేముల సతీష్ రిమాండ్ రిపోర్టులో ఏ2 ప్రోద్భలంతో ఏ1 అయిన సతీష్ దాడికి పాల్పడినట్లు చెప్పారు. కానీ ఇప్పటికీ ఏ2 ఎవరో చెప్పలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+