Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో మూడు రకాల ట్యాక్స్ ల దందా : వైసీపీ నేతల దెబ్బకు కాంట్రాక్టర్ లు పరార్ : అచ్చెన్న వ్యాఖ్యలకు కారణమదే !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రకాల ట్యాక్స్ ల దందా నడుస్తుందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. దేశంలో కొబ్బరికాయలు కొట్టి అందరూ పనులు మొదలు పెడితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం జేఎంఎం ట్యాక్స్ లు కట్టి పనులు ప్రారంభించాల్సి వస్తోందని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్ర స్థాయిలో జె ట్యాక్స్, జిల్లా స్థాయిలో మంత్రి ట్యాక్స్, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే ట్యాక్స్ అమలవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ ట్యాక్స్ లు చెల్లిస్తేనే పనులు చెయ్యనిస్తున్నారని అచ్చెన్న ధ్వజమెత్తారు.

రాయదుర్గంలో జయరామిరెడ్డి బెదిరింపు సిగ్గు చేటు : అచ్చెన్న

రాయదుర్గంలో జయరామిరెడ్డి బెదిరింపు సిగ్గు చేటు : అచ్చెన్న

రాష్ట్రంలో కాంట్రాక్టర్లను బెదిరిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు జయరామిరెడ్డి బరితెగింపు ఇందుకు నిదర్శనమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. రాయదుర్గంలో జయరామిరెడ్డి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను అని పేర్కొన్న అచ్చెన్నాయుడు పనులు చేస్తున్న వారిని బెదిరించటం సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యానించారు. వారి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ నేతల తీరుతో రాష్ట్రంలో పనులు చేయడానికి ఏ కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు.

జగన్ పాలనలో కాంట్రాక్టర్లు వైసీపీ నాయకుల దెబ్బకు పారిపోతున్నారు

జగన్ పాలనలో కాంట్రాక్టర్లు వైసీపీ నాయకుల దెబ్బకు పారిపోతున్నారు

జగన్ పాలన చేపట్టిన నాటి నుండి రెండేళ్ళ కాలంలో వందలాది మంది కాంట్రాక్టర్లు వైసిపి నాయకుల దోపిడికి భయపడి పారిపోయారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అని ప్రజలకు చెప్పి, వాహనాల చక్రాలు ఊడిపోయేలా పాలన చేస్తున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మద్యం, ఇసుక, మైనింగ్, జూదం ద్వారా సంపాదిస్తున్నది సరిపోక ఇప్పుడు మళ్లీ కాంట్రాక్టర్లపై పడ్డారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గత రెండేళ్లలో ఎంతో మంది కాంట్రాక్టర్లను ముడుపుల కోసం బెదిరించి తరిమేశారని అచ్చెన్న ఆరోపించారు.

 రహదారుల గోతుల్లో మిమ్మల్ని , మీ పార్టీని ప్రజలు తొక్కేస్తారన్న అచ్చెన్న

రహదారుల గోతుల్లో మిమ్మల్ని , మీ పార్టీని ప్రజలు తొక్కేస్తారన్న అచ్చెన్న

ప్రభుత్వం తీరు మారకుంటే ప్రజలు కచ్చితంగా తిరుగుబాటు చేస్తారని, పరిస్థితులు ఇలాగే ఉంటే రహదారుల గోతుల్లో మిమ్మల్ని , మీ పార్టీని ప్రజలు తొక్కేస్తారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తాజాగా కాంట్రాక్టర్ ను బెదిరించిన వ్యవహారం ఏపీలో దుమారం రేపగా ఇప్పుడు అది టీడీపీ నేతలకు ఆయుధంగా మారింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు, అధికార పార్టీ నేత జయరామిరెడ్డి రోడ్ కాంట్రాక్టర్ పై బెదిరింపులకు దిగారని సమాచారం.

 రాయదుర్గంలో రోడ్ కాంట్రాక్టర్ ను బెదిరిస్తూ వైసీపీ నాయకుడి వ్యాఖ్యలు

రాయదుర్గంలో రోడ్ కాంట్రాక్టర్ ను బెదిరిస్తూ వైసీపీ నాయకుడి వ్యాఖ్యలు

రాయదుర్గం కనేకల్ రహదారి పనులు నిలిపివేయాలని, తమ నాయకుడు చెప్పిన మాట వినకుండా పనులు చేస్తే లెక్క తేల్చేస్తామంటూ హల్ చల్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యేను కలవకుండా పనులు ఎలా చేస్తారంటూ కాంట్రాక్టర్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారని సమాచారం . వెంటనే పనులు ఆపాలని లేదంటే భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరికలు జారీ చేశారు. రాయదుర్గంలో అధికార పార్టీ నాయకుడు కాంట్రాక్టర్ ను బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నేతలు వైసిపి నాయకులపై విరుచుకుపడుతున్నారు.

రాష్ట్రంలో జే ట్యాక్స్ , జిల్లాలో మంత్రుల ట్యాక్స్ , నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ట్యాక్స్

రాష్ట్రంలో జే ట్యాక్స్ , జిల్లాలో మంత్రుల ట్యాక్స్ , నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ట్యాక్స్

రాష్ట్రంలో జగన్ ట్యాక్స్, జిల్లాలలో మంత్రుల ట్యాక్స్ , నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల ట్యాక్స్ తో ప్రజలను దోచుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఇదే విధంగా ఉందని, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల విషయంలో ముందుగా కాంట్రాక్టర్ ఎమ్మెల్యేలతో మాట్లాడాలని, లేదంటే ఆ కాంట్రాక్టర్ పని అయిపోయినట్లే అని విమర్శిస్తున్నారు. ఇలా అయితే ఏ కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు వస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అన్ని పనుల్లోనూ వాటా వసూలు చేయడం, కాంట్రాక్టర్లను బెదిరించడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారిందని టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+