టైగర్ నాగేశ్వరరావు రియల్ స్టోరీ
స్టువర్టుపురంలో ఎంతోమంది దొంగలున్నప్పటికీ టైగర్ నాగేశ్వరరావుది ప్రత్యేక శైలి. ఆయన మీద ఎన్నో కేసులుండేవి. పెద్ద దొంగల ముఠాను నడిపేవాడు. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ వారినుంచి సులువుగా తప్పించుకునేవాడు. 1980 మార్చి 23వ తేదీన ఓ మహిళతో ఓ ఇంట్లో ఉండగా పోలీసులు చుట్టుముట్టారు. మార్చి 24వ తేదీన జరిగిన కాల్పుల్లో మరణించాడు.
టైగర్ నాగేశ్వరరావు తండ్రి కూడా దొంగే. ఆయనకు దొంగతనం వారసత్వంగా వచ్చింది. ఎన్నో దొంగతనాలు, దోపిడీలు చేసినట్లు నాగేశ్వరరావు సోదరుడు ప్రభాకర్ రావు తెలిపాడు. అయితే టైగర్ సంపాదించిన సొమ్మును దానధర్మాలకు ఉపయోగించేవాడు. ఎవరికి ఏ అవసరం ఉంటే వారి అవసరాన్ని తీర్చేవాడు. నాగేశ్వరరావు దొంగతనాలు చేయడానికి ముందు రెండెకరాల పొలం ఉండేది. అది తప్ప వారికి ఏదీ మిగల్లేదు.

పోలీసుల నుంచి తప్పించుకోవడంలో ప్రజలే టైగర్ కు సాయం చేసేవారు. కాల్పుల్లో మరణించిన ఘటనపై ప్రజలు పోలీసులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బనగానపల్లెలో ఓసారి బ్యాంకును దోపిడీ చేశారు. పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉండేది ఆ బ్యాంకు. అర్థరాత్రి బ్యాంకు వెనకవైపు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి సేఫ్ ను స్మశానవాటికకు తీసుకువెళ్లారు. అందులో రూ.50వేల నగదు, 14 కిలోల బంగారం ఉన్నాయి. దాన్ని దొంగలంతా పంచుకోకముందే పోలీసులు వారున్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అయితే నాగేశ్వరరావు తప్పించుకున్నాడని, తాను మాత్రం లొంగిపోయానని ప్రభాకర్ రావు తెలిపారు. ఆ సమయంలో నాగేశ్వరరావు తప్పించుకోవడానికి ప్రజలే సహకరించారంట.












Click it and Unblock the Notifications