తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం సాయంత్రం తిరుమలలో ధ్వజరోహనం జరిగింది. ఉత్సవాలన వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు.
తొలిరోజైన సోమవారం మలయప్పస్వామి పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో విహరించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి పెద్దశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లోనూ తొలివాహన సేవ పెద్ద శేషవాహనంతోనే ప్రారంభమవడం ఆనవాయితీగా వస్తోంది.












Click it and Unblock the Notifications