తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త!
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల మీద కొలువుతీరిన శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల పవిత్రతను కాపాడేలా పలు నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో భక్తులకు అందించే అన్న ప్రసాదాన్ని మరింత రుచికరంగా అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది.
అన్న ప్రశాదంలో కొత్త ఐటమ్
ఇందులో భాగంగా అన్న ప్రసాదం మెనూలో మరొక కొత్త ఐటమ్ ను పెంచాలని టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టిటిడి బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ సిబ్బంది అన్న ప్రసాదం మెనూలో మార్పులు చేర్పులు చేపట్టారు. ఇక తిరుమల అన్న ప్రసాదంలో మసాలా వడలను చేర్చి ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.

మసాలా వడల ట్రయల్ రన్
ఈరోజు 5000మసాలా వడలను టిటిడి సిబ్బంది భక్తులకు వడ్డించారు. అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా ఈ మసాలావడలు తయారు చేయించి ఈరోజు ట్రయల్ రన్ లో భాగంగా భక్తులకు వడ్డించారు. అనంతరం మసాలా వడల రుచిపైన టిటిడి సిబ్బంది భక్తుల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఇక మెనూలో కొత్త ఐటమ్ తీసుకొచ్చి భక్తుల కోసం పెట్టిన క్రమంలో భక్తులు కూడా మసాలావడలు రుచికరంగా ఉన్నాయంటూ సంతృప్తిని వ్యక్తం చేశారు.
శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు
— B R Naidu (@BollineniRNaidu) January 20, 2025
మెనూలో ఒక ఐటమ్ పెంచాలని అధికారులను అదేశించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
చైర్మన్ అదేశానికి అనుగుణంగా మెనూలో మార్పులు చేస్తూ బోర్డులో నిర్ణయం
ట్రయల్ రన్ లో భాగంగా ఇవాళ 5వేల మసాలా వడలు భక్తులకు వడ్డించిన సిబ్బంది
ఉల్లిపాయలు,… pic.twitter.com/L07FYZFVY7
త్వరలో పూర్తిస్థాయిలో మెనూలో మార్పులు
ఇక ట్రయల్ రన్ లో లోటుపాట్లను సరిచేసుకొని త్వరలోనే పూర్తిస్థాయిలో మెనూలో మార్పులు చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఇక టిటిడి చైర్మన్ చేతుల మీదుగా ఈ మసాలా వడలను మెనూలో చేర్చే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తారు. టిటిడి చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన నాటినుండి అన్న ప్రసాదాల పైన ప్రధానంగా దృష్టి సారించారు.
అన్న ప్రసాదాల నాణ్యతపై టీటీడీ చైర్మన్ ఫోకస్
అన్న ప్రసాద నాణ్యతను పెంచేందుకు చర్యలు చేపట్టారు. తరచూ తనిఖీలు చేస్తూ సిబ్బందికి అన్నప్రసాదాల నాణ్యత పైన కీలక సూచనలు చేశారు. ఇక తాజాగా మరో కొత్త ఐటమ్ అన్న ప్రసాద మెనూలో చేర్చేందుకు సిద్ధం అవుతున్నారు
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications