తిరుమల ప్రక్షాళనకు ఏడు డిమాండ్లతో తిరుమల పరిరక్షణ పాదయాత్ర!

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై కొనసాగుతున్న వివాదం నేపధ్యంలో తిరుమల పరిరక్షణ పాదయాత్ర రేపటి నుండి ప్రారంభం కానుంది. తిరుమల పూర్తిస్థాయి ప్రక్షాళన సహా ప్రధానమైన ఏడు డిమాండ్ల సాధన కోసం పాదయాత్ర మరియు మెట్లోత్సవం చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో రేపు రామచంద్ర యాదవ్ తలపెట్టిన "తిరుమల పరిరక్షణ పాదయాత్ర"కి దేశ వ్యాప్తంగా సామాన్య భక్తజనం మద్దతుతో సహా.. ఆధ్యాత్మిక ప్రముఖులు, గురువులు, పీఠాధిపతులు నేరుగా హాజరు కానున్నారు.

తిరుమల పరిరక్షణ పాదయాత్రకు స్వామీజీలు
పుంగనూరులోని హనుమతరాయ దిన్నె వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రారంభ కార్యక్రమానికి రామానుజాచార్య వంశ పరంపర, యదుగిరి యతిరాజ్ మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ నారాయణ రామానుజ జీయర్ స్వామి, మహంత్ కళ్యాణ్ దాస్ జీ మహరాజ్ (హనుమాన్ మఠం పీఠాధిపతి, అయోధ్య), త్రిశక్తి మంత్రాశ్రమ సిద్దయోగులు ఆడిదండి శక్తిశ్రీ భగవతీ మహారాజ్, శ్రీ క్రిష్ణ యాదవానంద స్వామీజీ (యాదవ గురుపీఠం, కర్నాటక), శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ హాజరు కానున్నారు.

Tirumala parirakshana Padayatra with seven demands for cleansing Tirumala Swamijis in this padayatra

పుంగనూరు నుండి పాదయాత్ర,అలిపిరి నుండి మెట్లోత్సవం
రేపు పుంగనూరు నుండి అలిపిరి వరకు పాదయాత్ర ద్వారా చేరుకుని.. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకోనున్నారు. అలిపిరి నుండి తిరుమల వరకు "మెట్లోత్సవం" కార్యక్రమం నిర్వహించనున్నారు.. ఈ పాదయాత్ర సహా మెట్లోత్సవం కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.. తిరుమల రక్షణ కోసం, పవిత్రత కోసం, ప్రక్షాళన కోసం భక్తులు ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనాలనీ రామచంద్ర యాదవ్ కోరారు..

ప్రధాన డిమాండ్లు ఇవే
ముఖ్యంగా ఏడు డిమాండ్ లతో ఈ పాదయాత్ర చేపట్టారు. తిరుమలలో జరిగిన అపచారాలు, అవినీతి అక్రమాలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి 100 రోజుల్లో దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. TTD పాలక మండలి నుండి పరిపాలన వరకు పూర్తి ప్రక్షాళన చెయ్యాలని, పాలక మండలిలో రాజకీయ, కార్పొరేట్ శక్తులకు చోటు కల్పించకూడదని డిమాండ్ చేస్తున్నారు.

వీఐపీ దర్శనం, అన్యమత ఉద్యోగుల పైనా డిమాండ్స్
VIP దర్శన విధానాన్ని రద్దు చేసి ముఖ్యమంత్రి నుండి సామాన్య భక్తుని వరకు అందరికీ ఒకే విధమైన దర్శన ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.అన్యమత ఉద్యోగులు, వేయి కాళ్ళ మండపం - TTD లో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. తొలగించబడిన వేయికాళ్ళ మండపాన్ని వేరొక చోట వెంటనే నిర్మించాలని కోరుతున్నారు.

తిరుమల స్వామి ఆదాయం, ప్రసాదం విషయంలో డిమాండ్ ఇదే
తిరుపతిలో ఉన్న గోవిందరాజ స్వామి, కపిలతీర్థ, తిరుచానూరు అలివేలు మంగాపురం ఆలయాలకు కనీసం 2 కి.మీ పరిధిలో మాంసం, మద్యం దుకాణాలు నిషేదించాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల ఆదాయ, వ్యయాలపై ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఆడిట్ నిర్వహించి నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. తిరుమలలోనే గోశాల ఏర్పాటు చేసి తద్వారా సొంతంగా డెయిరీ నిర్వహించి ఆ నెయ్యిని మాత్రమే స్వామి వారి ప్రసాదాలలో వినియోగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడు డిమాండ్ల సాధన కోసం ఆర్సీవై పాదయాత్ర జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+