రూ.185 కోట్లతో తిరుపతిలో అభివృద్ధి పనులు
చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం మంగళవారం ఉదయం జరిగింది. చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన స్థానిక అన్నమయ్య భవన్ అతిథి గృహంలో జరిగింది. ఇందులో భాగంగా రూ.185 కోట్లతో తిరుపతిలో అభివృద్ధి చేయాలని పాలక మండలి నిర్ణయించింది. ఆవునెయ్యి కొనుగోలు చేసేందుకు రూ.178 కోట్లు మంజూరు చేసింది. తిరుచానురు అమ్మవారి ఆలయంలో చంద్రప్రభ వాహనానికి రూ.5 కోట్ల 6 లక్షల రూపాయలతో వెండి వాహనం చేయించనున్నారు.












Click it and Unblock the Notifications