తిరుమల కొండ కిటకిట, కొత్త రికార్డు - భక్తులకు టీటీడీ కీలక సూచనలు..!!

తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. వారం రోజులుగా తిరుమల భక్తులతో రద్దీగా మారింది. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా టీడీపీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇదే సమయంలో భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేస్తోంది. టీటీడీ సిబ్బందికి సహకరించాలని కోరుతోంది. శ్రీవారి అభిషేక సేవ సమయంలోనూ సర్వదర్శనం క్యూలైన్‌ను అధికారులు యథావిధిగా కొనసాగించారు.

తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. రికార్డు స్థాయిలో దర్శనాలు నమోదు అయ్యాయి. కుంఠ క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు, ఔటర్ రింగు రోడ్డు క్యూలైన్లు పూర్తిగా రద్దీగా మారాయి. తొలిసారిగా 94,758 మంది భక్తులు స్వామివారిని దర్శించు కున్నారు. వేకువజామున శ్రీవారి అభిషేక సేవ సమయంలోనూ సర్వదర్శనం క్యూలైన్‌ను అధికారులు యథావిధిగా కొనసాగించారు. దీంతో అదనంగా 5,850 మంది దర్శించుకోగలిగారు. అదే విధంగా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సాంకేతికతతో టీటీడీ భక్తుల రద్దీని పర్యవేక్ష్ిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్కరోజులో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ఏకంగా 90 వేలు దాటడం ఇది నాలుగోసారిగా అధికారులు గుర్తు చేస్తున్నారు.

త్రివేణి సంగమం..పోటెత్తిన భక్త జనం- పుష్కర స్నానాలు, ప్రత్యేకతలు..!!
త్రివేణి సంగమం..పోటెత్తిన భక్త జనం- పుష్కర స్నానాలు, ప్రత్యేకతలు..!!
tirumala-witnesses-massive-rush-of-pilgrims-over-the-last-few-days-sets-new-record-here-the-detail

రికార్డు స్థాయిలో దర్శనాలు

సీఎం చంద్రబాబు సూచనల మేరకు తిరుమలలో టీటీడీ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రణాళికబద్దంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ద్వారా నిరంతర పర్యవేక్షణతో భక్తులకు మెరుగైన సేవలను అందిస్తున్నారు. సమయపాలన, క్యూలైన్ మేనేజ్మెంట్ ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తూ శ్రీవారి దర్శనంతో పాటు వసతి, అన్నప్రసాదాలను అందజేస్తున్నారు. కాగా.. సిఫార్సు లేఖలపై ఇచ్చే దర్శనాలను రద్దు చేశారు. రెండు రోజుల సమయంలో పెద్ద సంఖ్యలో సాధారణ భక్తులకు దర్శనం అవకాశం కల్పించారు. టీటీడీ తీసుకుంటున్న చర్యలకు భక్తులు పూర్తిగా సహకరించాలని కోరుతన్నారు. ప్రస్తుతం దర్శనం కోసం దాదాపు 30 గంటల సమయం పడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+