తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

tirupati lok sabha bypoll results: 2 లక్షలు దాటిన వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యం

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. ఓట్ల లెక్కింపు మొదలైప్పటి నుంచీ వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యత చూపుతూ రెండు లక్షలకుపైగా ఆధిక్యం చాటారు.

ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2,00,411 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి భారీ తేడాతో వెనుకంజలో ఉన్నారు. ఇప్పటి వరకు వైయస్సార్సీపి అభ్యర్థికి 4,61,366 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 2,55,271 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 43,317 ఓట్లు వచ్చాయి.

tirupati lok sabha election results: YSRCP candidate Gurumurthy leading with 2 lakhs more votes

ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 7233 ఓట్లు రాగా, నోాటాకు 11,509 ఓట్లు పోలవడం గమనార్హం. కౌంటింగ్ ప్రక్రియను నలుగురు పరిశీలకులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ విజయం దాదాపు ఖరారు కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయ.

వైసీపీ- 4,61,366 (57 శాతం)
టీడీపీ- 2,55,271 (31.5 శాతం)
బీజేపీ-43,317 (5.4 శాతం)
కాంగ్రెస్- 7,233(0.9 శాతం)
సీపీఎం- 4,232 (0.6 శాతం)
ఇతరులు- 26,316 (3.3 శాతం)
నోటా-11,509 (1.4 శాతం)

English summary
tirupati lok sabha election results: YSRCP candidate Gurumurthy leading with 2 lakhs more votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X