చంద్రబాబుకు పరీక్షగా మారిన సొంత ఎమ్మెల్యే...!!

టీడీపీలో ఆ ఎమ్మెల్యే తీరు సంచలనంగా మారుతోంది. 135 మంది టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో ఈ ఎమ్మెల్సీ రూటు మాత్రం సపరేటు. సంచలనాల కోసం పార్టీని ఇబ్బందుల్లో కి నెడుతున్నారనే వాదన వినిపిస్తోంది. నియోజకవర్గంలో కేడర్ సైతం ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉంది. వరుసగా హైకమాండ్ కు ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా వ్యవహరిస్తున్న ఈ ఎమ్మెల్యే శైలి చంద్రబాబుకు పరీక్షగా మారుతోంది.

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు అత్యుత్సాహం పార్టీకి సమస్యగా మారుతోంది. అన్నీ తానే చేయాలనుకునే ఆలోచనా శైలి తల నొప్పులకు కారణమవుతోంది. అధికారులు చేయాల్సిన పనులనూ తానే చేస్తాననటం వివాదాలకు దారి తీస్తోంది. ఎవరైనా ఏదైనా సూచన చేస్తే రివర్స్ అవుతుండటంతో పార్టీ ముఖ్యులు వేచి చూసే ధోరణితో ఉంటున్నారు. ఎన్నికల వేళ అనూహ్యం గా సీటు దక్కించుకున్న కొలికపూడి ఎమ్మెల్యేగా గెలిచారు. నాటి నుంచే ఆయన వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. కంభంపాడులో భవనం కూల్చివేత ఘటనలో నాడు ఎమ్మెల్యే వ్యవహార శైలి విమర్శలకు కారణమైంది.

Tiruvuru TDP cadre angry over MLA Kolikapudi Srinivas complains to Chandra Babu

అధికారులు తాము చర్యలు తీసుకుంటామని చెప్పినా .. ఆయన వినకపోవటం తో పార్టీ అధినేత జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పేకాట శిబిరాల నిర్వహణ పైన కొలికపూడి దూషణలతో ఒక ప్రజాప్రతినిధి సతీమణి ఆత్మహత్యా యత్నం చేసారు. ఈ అంశం రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారింది. వరుస వివాదాల వేళ సీఎం చంద్రబాబు పిలిపించి మందలించారు. దూకుడు తగ్గించుకోవాలని సూచించారు. కానీ, ఎమ్మెల్సీ తీరులో మాత్రం మార్పు రాలేదు. తాజాగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారంటూ కొన్ని మద్యం దుకాణాలకు తాళాలు వేయించారు.

ఎవరైనా షాపులు ఓపెన్ చేస్తే సహించేది లేదని హెచ్చరిం చారు. బెల్టు షాపుల నియంత్రణ సరైనదే అయినా.. అందరి సమక్షంలో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు మాత్రం వివాదాస్పదంగా మారుతోంది. ప్రజల్లో ఇమేజ్ కోసం ఎమ్మెల్యే ఈ రకంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. కానీ, స్థానికంగా ఎమ్మెల్యే తీరుతో నష్టపోతున్నామని పార్టీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ సొంత పార్టీ ఎమ్మెల్యే పైన కేడర్ వరుస ఫిర్యాదులతో ఇప్పుడు టీడీపీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+