హైదరాబాద్: ఉమ్మడికి, షరతులకు నో చెప్పిన జెఏసి

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితులను ప్రజలకు చెప్పి, వారిని తెలంగాణ సాధన కోసం కార్యోన్ముఖులను చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఐకాస ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ పర్యటన ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. ఇక సెప్టెంబర్ 17ను విలీన దినంగా పాటించాలని కోదండరాం ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సిడబ్ల్యూసి చేసిన తీర్మానాన్ని అమలు చేయకుండా తాత్సారం చేయడం వల్లే ఆంధ్రా పాలకులు కుట్రలకు పాల్పడి తెలంగాణకు అడ్డుపడే అవకాశం కలిగింది. అంతేకాక ప్రజల మధ్య వారు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. ఈ కుట్రలను తిప్పికొట్టడంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకత్వం విఫలమైందని విమర్శించారు. తెలంగాణ ప్రకటనను త్వరగా అమలయ్యేలా చూసే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నేతలపైనే ఉందన్నారు.
తెలంగాణ విషయంలో ప్రతిపక్షాలు కూడా తమ పాత్రను సమర్థంగా పోషించడం లేదన్నారు. హైదరాబాద్‌పై ఎలాంటి పరిమితులు, షరతులకు కూడా అంగీకరించేది లేదన్నారు. కాగా, సకల జన భేరీ సభను నిజాం కళాశాల మైదానంలో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. సదస్సును విజయవంతం చేయడానికి ఈ 15 రోజులూ నిరంతర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు 10 జిల్లాల కేంద్రాల్లో ఒక్కో రోజు సన్నాహక రణభేరి పేరుతో ర్యాలీలు, సదస్సులు జరుగుతాయని చెప్పారు.












Click it and Unblock the Notifications