శ్రీరెడ్డికి మరో షాక్..! పవన్, లోకేష్ ను తిట్టిన కేసులో..

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నాయకులైన పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు, వీడియోలతో రెచ్చిపోయిన టాలీవుడ్ నటి, వైసీపీ కార్యకర్త శ్రీరెడ్డికి కూటమి ప్రభుత్వంలో చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమెపై రాష్ట్రంలోని పలు చోట్ల నమోదైన కేసులో చర్యలకు పోలీసులు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా ఆమెను ఇవాళ విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీసు స్టేషన్ కు పిలిపించారు.

వైసీపీ ప్రభుత్వంలో పవన్, లోకేష్ సహా కూటమి నాయకులపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహంగా ఉన్న టీడీపీ,జనసేన నాయకులు ఆమెపై పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో అరెస్టు చేస్తారనే భయంతో లోకేష్, పవన్, చంద్రబాబును తనను వదిలేయాలని బతిమాలుతూ పోస్టులు పెట్టారు. దీంతో శ్రీరెడ్డిని పోలీసులు ఏ కేసులోనూ ఇప్పటివరకూ అరెస్టు చేయలేదు. అలాగే పోలీసులు ఇతర చర్యలు కూడా తీసుకోలేదు. అయినా ఆమె భయంతో హైకోర్టును ఆశ్రయించి కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. మిగతా కేసుల్లో విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Tollywood actor sri reddy attended before Vizianagaram police in derogatory remarks case

దీంతో ఈ కేసుల్లో ఒకటైన నెల్లిమర్లలోని పూసపాటిరేగ పోలీసు స్టేషన్ లో విచారణకు శ్రీరెడ్డి హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టిందన్న ఫిర్యాదుపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరయ్యారు. దీంతో శ్రీరెడ్డిని స్టేషన్ సిఐ రామకృష్ణ విచారించారు. అనంతరం 41ఏ కింద నోటీసులు ఇచ్చి పంపించేశారు. మరోసారి విచారణకు ఆమెను పిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

గతంలో చంద్రబాబు, పవన్, లోకేష్ పై పెట్టిన అనుచిత పోస్టులపై నమోదైన కేసుల్లో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ హైకోర్టును శ్రీరెడ్డి ఆశ్రయించారు. అయితే ఫిబ్రవరి 24న విచారణ జరిపిన హైకోర్టు...విశాఖ పోలీసులు నమోదు చేసిన కేసులో మాత్రం ఊరటనిచ్చింది. కానీ చిత్తూరు వన్‌టౌన్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిలబుల్ సెక్షన్లే ఉండటంతో ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. అలాగే కర్నూలు టూటౌన్‌, గుడివాడ వన్‌టౌన్‌, విజయనగరం జిల్లా నెలిమర్లలో నమోదైన కేసుల్లో విచారణకు హాజరు కావాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+