150 మేకలు కాస్తా 11 అయ్యాయి-వైసీపీపై పృథ్వీ పంచ్ లు..!
టాలీవుడ్ లో థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ప్రస్తుత జనసేన నేత, మాజీ వైసీపీ నేత పృధ్వీరాజ్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదీ తన మాజీ పార్టీ వైసీపీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గతంలో వైసీపీలో ఉంటూ ఎస్వీబీసీ ఛైర్మన్ గా కూడా పనిచేసిన పృధ్వీరాజ్ లైంగిక వేధింపుల ఆరోపణల తర్వాత ఆ పదవి నుంచి తొలగించడంతో పార్టీని వీడారు. ఆ తర్వాత జనసేనలో చేరి కూటమి గెలుపు కోసం పనిచేశారు.

గతంలో వైసీపీలో పనిచేసి రాజీనామా చేశాక ఆ పార్టీపై సెటైర్లు వేయడం మొదలుపెట్టిన పృధ్వీరాజ్ ఇప్పుడు కూడా వాటిని కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ లో జరిగిన తన తాజా చిత్రం లైలా మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ కు వెళ్లిన పృధ్వీ అక్కడ సందర్భం లేకపోయినా వైసీపీని ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేశారు. గతంలో 151 సీట్లతో ఉన్న వైసీపీ ఇప్పుడు 11 సీట్లకు వచ్చేసిందని గుర్తుచేస్తూ ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చారు.
యాదృచ్ఛితంగా జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కానీ లైలా చిత్రంలో మేకల సత్తిని పట్టుకు రండ్రా అని ఒకతను చెప్తాడని, ఆ షాట్ గ్యాప్ లో మేకలు ఎన్ని ఉన్నాయని అడిగితే 70, 80 మొత్తం కలిపి 150 ఉన్నాయని పృథ్వీ తెలిపాడు. సినిమా క్లైమాక్స్ లో మరో సీన్ ఉందని, అందులో తన బామ్మర్ది రాగానే విలన్లు తనను వదిలేస్తారని, అప్పుడు లెక్కిస్తే 11 మేకలు మాత్రమే ఉన్నాయని పృథ్వీ తెలిపారు. అలా మాకన్నీ సినిమాలో అన్నీ బ్రహ్మాండమైన సీన్లు పెట్టారని చెప్పుకొచ్చారు.
పృధ్వీ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.గతంలో సినిమా వాళ్లను టార్గెట్ చేశారని టాలీవుడ్ ప్రముఖులు చెప్పిన మాటల్ని గుర్తుచేస్తూ.. ఇలాంటి పనులు చేస్తే మరి చేయరా అంటూ వైసీపీ సోషల్ మీడియా కౌంటర్లు ఇస్తోంది. అయితే పృధ్వీ వ్యాఖ్యలు చేసిన ఫంక్షన్లో చిరంజీవి కూడా పాల్లొనడం విశేషం.












Click it and Unblock the Notifications