సీఎం జగన్ కోరారు- వెంటనే మెగాస్టార్ ఓకే చెప్పారు : సమస్యలకు శుభం కార్డు - విశాఖ కేంద్రంగా ఇక..!!
ముఖ్యమంత్రితో జరిగిన చర్చల పట్ల తెలుగు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు. అన్ని సమస్యలకు శుభంకార్డు పడిందని చిరంజీవి ప్రకటించారు. టిక్కెట్ ధరలతో పాటుగా అన్ని అంశాల పట్ల సీఎం సాను కూలంగా స్పందించారని..అంగీకరించారని చిరంజీవి వెల్లడించారు. అదే సమయంలో తెలంగాణతో పాటుగా ఏపీలోనూ సినీ పరిశ్రమ డెవలప్ చేయటానికి ముందుకు రావాలని సీఎం జగన్ కోరారు. దీనికి అక్కడే వెంటనే మెగాస్టార్ చిరంజీవి అంగీకారం తెలిపారు. విశాఖ కేంద్రంగా పరిశ్రమ డెవలప్ చేయటానికి చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
Recommended Video

ఏపీలోనూ పరిశ్రమను విస్తరించండి
ప్రభుత్వ పరంగా తాము అన్ని రకాలుగా సహకరిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. తాము తప్పకుండా రెండు రాష్ట్రాల్లోనూ సినిమా పరిశ్రమ విస్తరణకు ముందుకొస్తామని చిరంజీవి స్పష్టం చేసారు. చిన్న సినిమాలకు తోడ్పాటు ఇచ్చేందుకు అయిదు షో ల ప్రదర్శనకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు. విశాఖ కేంద్రంగా పరిశ్రమ విస్తరణకు నిర్ణయాలు ఉంటాయని జగన్ స్పష్టం చేసారు. రెండు రాష్ట్రాల్లోనూ సమంగా ఇండస్ట్రీ ఎదగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. దీంతో.. చర్చల్లో పాల్గొన్న వారికి అందరూ సీఎం స్పందన పట్ల హర్షం వ్యక్తం చేసారు.

సీఎం స్పందన పైన హీరోల హర్షం
హీరో మహేష్ బాబు సైతం స్పందించారు. సీఎం అన్నింటి పైనా సానుకూలంగా స్పందించారని..త్వరలోనే అన్నింటికి సంబంధించి సానుకూల నిర్ణయాలతో ఉత్తర్వులు జారీ అవుతాయని చెప్పుకొచ్చారు. ప్రభాస్ సైతం సీఎం స్పందన పట్ల హర్షం వ్యక్తం చేసారు. చొరవ తీసుకున్న చిరంజీవిని ప్రశంసించారు. ఇక, ఆర్ నారాయణ మూర్తి మాత్రం నంది అవార్డుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సారి చర్చల్లో ఫిలిం ఛాంబర్ తో పాటుగా ఇతర సంఘాలను ఆహ్వానించాలని కోరారు.

మూడో వారంలోగా పరిష్కారం...
విశాఖలో షూటింగ్స్ పెద్ద ఎత్తున జరిగేలా..పరిశ్రమ ముందుకు రావాలని సీఎం జగన్ కోరినట్లుగా మంత్రి పేర్ని నాని చెప్పారు. సీఎం పిలుపుకు అందరూ సుముఖంగా స్పందించారని చెప్పారు. తమకు హైదరాబాద్ ఎంతో..ఏపీలోనూ షూటింగ్ చేస్తామని ఆనందంతో స్పందించారని చెప్పుకొచ్చారు. చిన్న సినిమాలకు సైతం ప్రభుత్వం నుంచి తోడ్పాటు ఉంటుందని... అదే విధంగా ఫిలిం ఛాంబర్ తో చర్చలకు తాము ఎప్పుడూ సిద్దమేని మంత్రి నాని వెల్లడించారు. ఇక, కొంత కాలంగా డైలమా పరిస్థితుల్లో ఉన్న తమకు సీఎంతో సమావేశం తరువాత భారీ రిలీఫ్ వచ్చిందని హీరో మహేష్.. ప్రభాస్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications