వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేన: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ అభిమానులను నిరాశపరిచారనే వ్యాఖ్య వినిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయడం ముఖ్యం కాదని, పోటీ చేస్తామో లేదో తెలియదని ఆయన అన్నారు. దీంతో అబిమానులు నిరాశపడినట్లు తెలు్సోతంది. పదవులు, అధికారంలోకి తాము రావడం లేదని, ఎన్నికల్లో పోటీ చేస్తానో, లేదో కూడా తెలియదని, పోటీ చేస్తాం గానీ,ఇప్పుడా, కొన్నేళ్ల తర్వాత అనేదీ చెప్పలేనని అన్నారు.

"నేను రెడీగా లేను. అట్నుంచి ఇటు దూకే జంపర్స్, జోకర్స్‌ను వెంటేసుకు తిరగను. అది నాకు చిరాకు" అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ నిర్మాణంపై దృషశ్టి పెడుతానని, ఈ రోజు పార్టీ కార్యాలయం కూడా లేదని ఆయన అన్నారు. డబ్బులు కూడా లేవని ఆయన అన్నారు. ఏవైనా సినిమా డబ్బులు రావాల్సిందేనని ఆయన అన్నారు.

Tollywood star Pawan Kalyan lets down fans, not to contest polls

అయితే, కాంగ్రెసు మినహా ఏ పార్టీతోనైనా తాను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని, తాను చెప్పిన విషయాలు చేయడానికి అంగీకరించే పార్టీలతో కలిసి పనిచేస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ, సీమాంధ్రలో కాంగ్రెసును ఖతం చేయడమే తన ఉద్దేశమని ఆయన అన్నారు.

కాంగ్రెసు నాయకులనే కాకుండా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులను కూడా లక్ష్యం చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను వర్తమానం గురించి కాకుండా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నానని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేకపోవచ్చునని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన అభిమానునలను నిరాశపరిచిందని అంటున్నారు. రెండు గంటల పాటు ఆయన ప్రసంగం సాగింది.

English summary

 Taking off from a few of his movie dialogues, the actor Pawan Kalyan dropped enough hints to say that the posts of MLA, MP, minister or chief minister mattered little to him but made it clear that he was anti-Congress. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X