అసలే సంక్రాంతి సీజన్- చేతిలో భారీ సినిమాలు: దిక్కుతోచని స్థితిలో టాలీవుడ్?: చంద్రబాబుతో భేటీ?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ముసురుకున్న వివాదాలు రోజురోజుకూ తీవ్ర రూపాన్ని దాల్చుతూ వస్తోన్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన.. అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చిన తరువాత ఈ వ్యవహారం మొత్తం రోజుకో మలుపు తిరుగుతోంది. అల్లు అర్జున్‌ను మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది.

నో బెనిఫిట్ షోస్..

సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ముందు రాష్ట్రంలో ఎలాంటి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించింది. అలాంటి షోలు రద్దు చేస్తామంటూ నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా వెల్లడించారు.

Tollywood top brass likely to meet CM Chandrababu

చేతిలో భారీ సినిమాలు..

ఒకవైపు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం, మరోవైపు బెనిఫిట్/ప్రీమియర్ షోలను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం, టికెట్ల రేట్లను పెంచుకోవడానికి ఎంతమాత్రమూ అనుమతి ఇచ్చే అవకాశాలు లేకపోవడం, ఈ సంక్రాంతి పండగ సీజన్‌లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో టాలీవుడ్‌కు దిక్కుతోచట్లేదు.

గేమ్ ఛేంజర్ సహా..

ఈ సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ విడుదల కాబోతోంది. శంకర్ దర్శకుడు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ జనవరి 10వ తేదీన విడుదల కానుంది. దీనితో పాటు బాలకృష్ణ నెక్స్ట్ మూవీ డాకు మహారాజ్ 12వ తేదీన, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, సందీప్ కిషన్ మజాకా సినిమాలు 14న విడుదల కానున్నాయి.

ఉక్కిరిబిక్కిరి..

ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్ వివాదం తెర మీదికి రావడంతో టాలీవుడ్ ఉక్కిరిబిక్కిరికి గురవుతోంది. తెలంగాణ మార్కెట్ మీద దాదాపుగా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు ఎదురైనట్టు భావిస్తోంది. టికెట్లు పెంచుకునే అవకాశం గానీ, బెనిఫిట్ షోలకూ అనుమతి గానీ దక్కకపోవచ్చనే నిర్ణయానికి టాలీవుడ్ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది.

చంద్రబాబుతో అపాయింట్‌మెంట్...

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని టాలీవుడ్ పెద్దలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ కావాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తోన్నారని, దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని అంటున్నారు. అపాయింట్‌మెంట్ లభించిన వెంటనే ఆయనను కలుస్తారని సమాచారం.

ఏపీపై దృష్టి..

సంక్రాంతికి విడుదల కాబోతోన్న సినిమాలకు సాధారణంగానే ఏపీ అతి పెద్ద మార్కెట్‌గా ఉంటూ వస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో నివసించే తెలుగు ప్రజలు స్వస్థలాలకు చేరుకుంటుంటారు. సినిమాలు, కోడిపందేలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు ఈ సీజన్‌లో. యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా సంక్రాంతి వారంలో భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టుకుంటుంటాయి.

బెనిఫిట్ షోలకు అనుమతి..

తెలంగాణలో సంభవించే నష్టాన్ని ఏపీలో పూడ్చుకునేలా టాలీవుడ్ పెద్దలు పావులు కదుపుతున్నారని అంటున్నారు. బెనిఫిట్ షోలను ప్రదర్శించుకోవడానికి, టికెట్ల రేట్లను పెంచుకోవడానికి అనుమతి పొందడం, టాలీవుడ్‌లో తలెత్తిన ఈ వివాదాన్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు కోరే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+