వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో టూరిజం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్..?: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి గుడ్ న్యూస్. పర్యాటక రంగానికి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు భారత పర్యాటక అభివృద్ధి సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నామని స్పష్టం చేశారు. ఐటీడీసీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కమలవర్ధనరావుతో బుధవారం ఢిల్లీలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. తర్వాత లోథి హోటల్‌లో జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ సీఎండీ గురుదీప్ సింగ్‌ను మంత్రి కలిశారు.

విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్..

విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్..

విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో ఎన్టీపీసీకి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం మంత్రి మేకపాటి ప్రతిపాదన చేశారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు, అప్రెంటిషిప్ కార్యక్రమాల్లో భాగస్వామ్యానికి ఎన్టీపీసీ సీఎండీ ఆమోదం తెలిపారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనిల్ కుమార్ చౌదరితో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్‌కు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు ప్రతిపాదనను మంత్రి గౌతమ్ రెడ్డి సెయిల్ సీఎండీకి వివరించారు. సీఎస్ఆర్ ద్వారా ఆర్థిక సహకారం అందించాలనీ కోరారు.

ఢిల్లీలో బిజీ బిజీ..

ఢిల్లీలో బిజీ బిజీ..

సీవోఈ ఏర్పాటుపై చర్చించి నిర్ణయం చెబుతామని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ చౌదరి తెలిపారు. హెచ్ఆర్డీ కేంద్రాల ద్వారా పాఠశాల పూర్తి చేసిన విద్యార్థులకు, ఇంజనీరింగ్ యువత రాసే 'గేట్' పరీక్షలకు , అప్రెంటిషిప్ కార్యక్రమాలకు, శిక్షణలో తోడ్పాటును అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతకు పరిశ్రమలలో ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణతోపాటు రాష్ట్రంలో స్కిల్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ సాయం కోసం మంత్రి మేకపాటి ఢిల్లీలో పర్యటిస్తున్నారు.

Recommended Video

YSR Asara Scheme For SHGs : 8 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలకు బెనిఫిట్, రూ.6345 కోట్లతో !
 గురువారం పీయూష్ గోయల్‌తో భేటీ..

గురువారం పీయూష్ గోయల్‌తో భేటీ..

తొలిరోజు బుధవారం కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఐటీడీసీ, ఎన్టీపీసీ, ఎస్ఏఐల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లతో మీట్ అయ్యారు. మంత్రి మేకపాటితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. గురువారం కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయను పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి సమావేశమవుతారు.

English summary
Tourism Centre of Excellence in Andhra pradesh state minister mekapati gautham reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X