ఉండిలో డేంజర్ బెల్స్ - బిగ్ ట్విస్ట్, విజయం ఆయనదేనా..!!
ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. కీలక నియోజకవర్గాల్లో పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. సామాజిక సమీకరణాలు, సంక్షేమం చుట్టూ ఎన్నికల రాజకీయం కొనసాగుతోంది. ఓటర్లను ఆకట్టుకొనేందుకు పార్టీలు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో అనూహ్య రాజకీయం కొనసాగుతోంది. టీడీపీ రెబల్ గా బరిలోకి దిగిన శివరామ రాజు మిగిలిన ఇద్దరు ప్రధాన అభ్యర్దులను డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు.
హోరా హోరీ రాజకీయం
ఉండి అసెంబ్లీ ఎన్నిక రాజకీయం ఆసక్తిగా మారుతుంది. బిజెపి నుంచి ఎంపీ సీటు ఆశించి దక్కకపోవటంతో టీడీపీలో చేరిన రఘురామరాజు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. వైసీపీ నుంచి నరసింహారాజు పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికలో ఈసారి టిడిపి నుంచి రెబల్ అభ్యర్థిగా మారి ప్రస్తుతం ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివరామరాజు కీలకంగా మారారు. టిడిపిలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన శివరామరాజు ఉండి సీటు ఆశించారు. తొలుత ఈ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించర టిడిపి అధినేత చంద్రబాబు ఆ తర్వాత రఘురామరాజు కు కేటాయించారు. శివరామరాజు ఇప్పుడు ఎన్నికలు ఏమేరా ప్రభావం చూపిస్తారనేది ఆసక్తిగా మారుతుంది. నామినేషన్ సమయంలోను శివరామరాజు భారీ ఎత్తున సమీకరణ చేశారు. ముగ్గురు అభ్యర్థులు ప్రచారంలో హోరాహోరీగా ముందుకు వెళ్తున్నారు.

శివరామ రాజు కేంద్రంగా
ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బరిలోకి దిగిన శివరామరాజు ఎవరి ఓట్లు చీలుస్తారనేదే ఇప్పుడు ఎన్నిక ఫలితం ఆధారపడి ఉంది. ఆయన రెండుసార్లు టిడిపి నుంచి గెలిచి ఉండటంతో ఆ పార్టీకి చెందిన ఓట్లని చీలుస్తారని అభిప్రాయం నెలకొంది. వైసిపి లోని ఒక వర్గం సైతం ఆయనకు మద్దతు ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. రఘురామరాజు ఓటమిపై కన్నేసిన వైసిపి శివరామరాజుకు పరోక్షంగా సహకారం అందిస్తుందని అభిప్రాయం వినిపిస్తుంది. శివరామరాజుకు 30000 ఓట్లకు పైగా పోలో అవుతాయని ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. అయితే స్థానిక సామాజిక సమీకరణాలు, మూడు పార్టీల కలయిక తమకు కలిసి వస్తుందని రఘురామరాజు నమ్మకం పెట్టుకున్నారు.
కలిసొచ్చెదెవరికి
ఇక్కడ కాపు ఓటింగ్ 46,000 ఉంది. శెట్టిబలిజ 28000, క్షత్రియ 24000, ఎస్సీలు 28,000, తూర్పు కాపు 22000, యాదవ 9000, అగ్నికుల క్షత్రియ ఎనిమిది వేలు, రజక 6000, ఆర్యవైశ్య 5000, ఇతర బీసీ కులాలు 30,000 ఉన్నాయి. ఈ సామాజిక సమీకరణాల్లో అభ్యర్థులు ఎవరికి వారు తమకే మెజార్టీ మద్దతు ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసిపి తమ సంక్షేమ పథకాల లబ్ధిదారులు, తమకు మద్దతుగా నిలుస్తున్న సామాజిక వర్గాల ఓట్లతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే టిడిపి నుంచి రఘురాం రాజుకు పూర్తిస్థాయి సహకారం పైన కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ వ్యతిరేకించారని వైసిపి వ్యతిరేక వర్గాల మద్దతు ఉన్నా.. ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గంలో లేకపోవడం రఘురామకు మైనస్ గా మారింది. వైసిపి అభ్యర్థి నరసింహరాజు ఆర్థికంగా సంపన్నుడు. అయితే జనంలోకి రారని అభిప్రాయం బలంగా ఉంది. దీంతో శివరామరాజు మరింత బలం ఉంచుకుంటే నియోజకవర్గంలో అనూహ్య ఫలితం వెల్లడియ అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications