విద్యాసంస్థల బంద్‌కి పిలుపు, కేసీఆర్‌కి జర్నలిస్ట్‌ల సెగ

ఎమర్జెన్సీని తలపిస్తోంది: లక్ష్మణ్
కేసీఆర్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ వేరుగా మండిపడ్డారు. ఏబీఎన్, టీవీ-9 మహిళా జర్నలిస్టులపై పోలీసుల తీరును తప్పుపట్టిన ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ నియంతృత్వ పాలనకు కేసీఆర్ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కేసీఆర్‌ను విమర్శిస్తే తెలంగాణ వ్యతిరేకులని ముద్ర వేస్తున్నారన్నారు. ఇప్పటికైనా చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలన్నారు.
తెలంగాణ సెంట్‌మెంట్‌తో ఎల్లకాలం పాలన సాగించలేరన్నారు. వలసలపై ఉన్న దృష్టి పాలనపై లేదన్నారు. కేసీఆర్ మాటలు కోటలు దాటాయే గానీ చేతల్లో మాత్రం చూపడం లేదన్నారు. కేసీఆర్‌కు పరిపాలనా దక్షత లేదన్నారు. ఇంకా ఉద్యమ పార్టీలా ఆలోచిస్తున్నారని ధ్వజమెత్తారు. మజ్లిస్ అజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నారని, అన్నీ వివాదాస్పద నిర్ణయాలే అన్నారు.
వరంగల్‌లో కేసీఆర్ ఎదుట జర్నలిస్టుల నిరసన
వరంగల్ జిల్లాలోని కాళోజీ శత జయంతి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మంగళవారం జర్నలిస్టుల నిరసన సెగ తగిలింది. తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు ఫ్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దీనిపై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు జర్నలిస్టులను ప్రక్కకు నెట్టే ప్రయత్నం చేయగా పోలీసులు-జర్నలిస్టుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications