వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతర్వేదిలో సముద్రం ముందుకు, ఉప్పాడలో వెనక్కు.. సముద్రంలో భూకంపం, తీర ప్రాంతాల్లో సునామీ భయం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో పలుచోట్ల సముద్రతీరంలో జరుగుతున్న మార్పులు ఆందోళనకు కారణం గా మారుతున్నాయి .సముద్రంలో చోటుచేసుకుంటున్న భూ ప్రకంపనలు సునామీకి సంకేతమా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అంతర్వేదిలో సముద్రం ముందుకు రావటం, ఉప్పాడలో సముద్రం వెనక్కు పోవటం, సముద్రం రంగు మారటం, సముద్రంలో భూకంపం రావటం ఇప్పుడు ఏపీలో సునామీ భయానికి కారణంగా మారుతున్నాయి.

శ్రీశైలం డ్యాంలో కొనసాగుతున్న హైడ్రో గ్రాఫిక్ సర్వే .. మట్టి పూడికతో ప్రమాదం, డ్యాం నీటి సామర్ధ్యంపై చర్చ శ్రీశైలం డ్యాంలో కొనసాగుతున్న హైడ్రో గ్రాఫిక్ సర్వే .. మట్టి పూడికతో ప్రమాదం, డ్యాం నీటి సామర్ధ్యంపై చర్చ

అంతర్వేదిలో ముందుకొచ్చిన సముద్రం , ఆందోళనలో జనం

అంతర్వేదిలో ముందుకొచ్చిన సముద్రం , ఆందోళనలో జనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం కోతకు గురైంది. నెల రోజుల్లో 45 మీటర్లు ముందుకు వచ్చింది. అంతేకాదు సముద్రం రంగులో మార్పు కూడా సంభవించింది. గతంలో ఎప్పుడూ అంతర్వేది వద్ద సముద్రం అంతగా ముందుకు రాలేదని స్థానికులు చెబుతున్నారు. ఒక్క నెల రోజుల్లోనే అంతర్వేది వద్ద సముద్రంలో చోటుచేసుకుంటున్న అలజడి తీర ప్రాంత వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అంతర్వేది వద్ద తీరంలో ఉన్న గెస్ట్ హౌస్, కొన్ని గృహాలు సముద్రం ముందుకు రావడంతో, ఉగ్రరూపం దాల్చడంతో కొట్టుకుపో

అంతర్వేదిలోనే కాదు ఉప్పాడలోనూ సముద్రంలో మార్పులు

అంతర్వేదిలోనే కాదు ఉప్పాడలోనూ సముద్రంలో మార్పులు

సఖినేటిపల్లి మండలం అంతర్వేది తో పాటుగా, కాకినాడ నుండి ఉప్పాడ లోని సముద్రంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్న ఒక్క సారిగా సముద్రంలో చోటు చేసుకున్న భూప్రకంపనలు తీర ప్రాంత వాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్వేది వద్ద సముద్రం ఉగ్రరూపం దాల్చి ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనకు కారణం అవుతుంది. ముఖ్యంగా సునామీ వస్తుందేమో అని తీరప్రాంత వాసులు భయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటు ఉప్పాడ తీరంలో సముద్రం లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఉప్పాడ తీరంలో 100 మీటర్ల మేర వెనక్కు వెళ్ళిన సముద్రం

ఉప్పాడ తీరంలో 100 మీటర్ల మేర వెనక్కు వెళ్ళిన సముద్రం

ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఉప్పాడ తీరం వెంబడి రాకాసి అలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఉప్పాడ తీరం కోతకు గురైంది. సముద్రం ముందుకు వచ్చి ఉప్పాడ తీరం బీచ్ రోడ్డుకు తాకుతూ కెరటాలు ఎగిసి పడుతుండడం అక్కడి వారికి ఆందోళన కలిగిస్తుంది. ఇదే సమయంలో ఒక్కసారిగా సముద్రం కొన్ని మీటర్ల మేర వెనక్కి వెళ్లి పోయింది. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఉప్పాడలో నిన్న 100 మీటర్ల మేర సముద్రం వెనక్కి వెళ్లినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 50 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది.

బంగాళాఖాతంలో భూ ప్రకంపనలు .. భయం గుప్పిట్లో తీర ప్రాంత ప్రజలు

బంగాళాఖాతంలో భూ ప్రకంపనలు .. భయం గుప్పిట్లో తీర ప్రాంత ప్రజలు


అటు అంతర్వేది ,ఇటు ఉప్పాడలో సముద్రంలో చోటు చేసుకుంటున్న తీవ్ర పరిణామాలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇక తాజాగా బంగాళాఖాతంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు శాస్త్ర వేత్తలకు సైతం అంతు చిక్కని పరిస్థితి ఉంది. ఇదే సమయంలో బంగాళాఖాతంలో భూప్రకంపనలు సంభవించటం కూడా సునామీకి సంకేతంగా భావిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. నిన్న బంగాళాఖాతంలో 5.1 తీవ్రతతో భూకంపం రాగా, చెన్నైలో స్వల్పంగా భూ ప్రకంపనలు నమోదయినట్లు గా తెలుస్తుంది.

కాకినాడ సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ

కాకినాడ సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ సమీపంలో భూమి నుండి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. అంతర్వేది, నరసాపురం, రాజోలు, పాలకొల్లు వంటి సముద్రతీర ప్రాంతాలలో భూమి కనిపించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో ప్రస్తుతం అలలను పరిశీలిస్తున్నామని, ముందస్తుగా సునామిపై అంచనా వేయలేమని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూప్రకంపనలు కారణంగానే ఒక చోట సముద్రం ముందుకు మరొక చోట వెనక్కు వచ్చినట్లుగా అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ సమీపంలో కేంద్రీకృతమైన భూకంపం ఆగ్నేయంగా 296 కిలోమీటర్లు, చెన్నైకి ఈశాన్యంగా 320 కిలోమీటర్ల భూకంప కేంద్రం గుర్తించినట్లుగా పేర్కొన్నారు.

తాజా పరిణామాలపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు

తాజా పరిణామాలపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు

సముద్రంలో చోటు చేసుకున్న భూకంపానికి, సముద్ర అలల తీరుకు ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలో పరిశీలిస్తున్నారు. ఒక్కసారిగా సముద్రం ముందుకు రావడం, కొన్ని మీటర్ల మేర వెనక్కి వెళ్లడం, సముద్రంలో భూమి కనిపించడం వంటి పరిణామాలు సునామీ హెచ్చరికలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ సునామీ హెచ్చరికల కేంద్రం నుండి ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ఈ పరిణామంపై లోతుగా పరిశీలన జరుపుతున్నట్లు సమాచారం.

English summary
coastal areas in AP are in a state of panic. Coastal changes in many parts of the bay of bengal in AP are becoming a cause for concern. The sea rising in antarvedi, the sea receding in the uppada, the earthquake in the sea are now changing due to the tsunami fear in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X