బ్లాక్‌లో శ్రీవారి లడ్డూ: టీటీడీ కొత్త పాలసీతో బ్రేక్

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతోంది. ఆదివారం 81,207 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,414 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.53 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అయిదు కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న వారికి శ్రీవారి సేవకులు మంచినీరు, పాలు, అల్పాహారాన్ని అందించారు.

TTD affirmed two Laddus for token less devotees at Tirumala

కాగా శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వస్తోన్న పుకార్లను నమ్మవద్దని టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందిస్తామని అన్నారు. దర్శనానంతరం భక్తులకు ఒక ఉచిత లడ్డూ, తగినన్ని 50 రూపాయల లడ్డూ ప్రసాదాలు ఇస్తామని, ఇందులో ఎలాంటి మార్పూ లేదని చెప్పారు.

స్వామివారిని దర్శించుకోకుండా లడ్డూల కోసం నేరుగా కౌంటర్లకు వెళ్లే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా రోజువారి రెండు లడ్డూలు ఇవ్వనున్నట్లు శ్యామలరావు తెలిపారు. టీటీడీ ప్రతిరోజు 3.5 లక్షల లడ్డూలను విక్రయిస్తోందని, ఇందులో 2.5 లక్షల లడ్డూలు మాత్రమే భక్తులకు చేరుతున్నాయని వివరించారు.

మిగిలిన లక్ష లడ్డూలు దర్శనం టోకెన్లు లేనివారు కొనుగోలు చేస్తోన్నారని పేర్కొన్నారు. కొందరు దళారులు లడ్డూలను భారీ మొత్తంలో కొనుగోలు చేసి, బయట ప్రాంతాలలో అధిక ధరలకు విక్రయిస్తోన్నారని తమ విచారణలో తేలిందని శ్యామలరావు తెలిపారు. అదేవిధంగా పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పంచుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు.

వాటిని అరికట్టడానికి కొత్త విధానాన్ని తీసుకొస్తోన్నట్లు శ్యామలరావు చెప్పారు. శ్రీవారి దర్శనం చేసుకోకుండా నేరుగా లడ్డూలను కొనుగోలు చేసే వారికి ఆధార్ కార్డుపై రోజుకు రెండు లడ్డూలను మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. దళారులు లడ్డూల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడం, సామాన్య భక్తులకు ప్రయోజనాల కోసమే ఈ విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు.

దర్శనం టికెట్లు లేని కొంతమంది శ్రీవారి లడ్డూలను భారీ సంఖ్యలో కొనుగోలు చేసి బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించామని శ్యామలరావు వివరించారు. ఈ అవకతవకల్లో కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉన్నారని, అలాంటి వారి వివరాలను సేకరించామని, చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కొత్త లడ్డూ విధానంపై వివిధ మీడియాలో వస్తోన్న కథనాలు, వదంతులను నమ్మవద్దని శ్యామలరావు భక్తులకు విజ్ఞప్తి చేశారు. కొత్త విధానం వల్ల సామాన్య భక్తులు లడ్డూలను పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, మధ్యవర్తుల బెడద అంతం కానుందని ఆయన అన్నారు.

టీటీడీ అనుబంధ ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తోన్నామని శ్యామలరావు తెలిపారు. తిరుమలతో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్న శ్రీవారి భక్తులకు కూడా లడ్డూ ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీనివల్ల భక్తులు దళారుల నుంచి వాటిని పెద్దమొత్తంలో కొనుగోల చేయకుండా నిరోధించగలమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం అమలు చేస్తోన్న విధానం ద్వారా మూడు రోజులుగా భక్తుల ఆధార్ కార్డు నమోదుతో విక్రయిస్తోన్న లడ్డూలు ఎవరికి ఇస్తున్నారు?, దర్శనం చేసుకోని వారు ఎన్ని లడ్డూలను తీసుకొంటున్నారనే వివరాలను నమోదు చేస్తోన్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+