TTD: వేసవి సెలవుల్లో తిరుమల వెళ్లే వారికి బిగ్ అప్డేట్..!!
Tirumala: తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. పరీక్షల తరువాత వేసవి సెలవుల్లో ప్రతీ ఏటా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సారి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్.. నేటి నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ముగిసిన తరువాత మొదలయ్యే రద్దీ.. జూన్ వరకూ కొనసాగనుంది. దీంతో, శ్రీవారి దర్శనం.. సేవలు.. వసతి కోసం టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది.
శ్రీవారి భక్తుల కోసం
శ్రీవారి భక్తుల కోసం జూన్ నెలలో దర్శనం..ఆర్జిత సేవా.. వసతి తో పాటుగా శ్రీవారి సేవలకు టోకెన్ల జారీ రేపు (మంగళవారం) నుంచి ప్రారంభం కానుంది. మార్చి 18న ఉదయం 10 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవ చ్చని అధికారులు సూచించారు. మార్చి 22న మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మార్చి 21న ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం
అదే విధంగా జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేం దుకు మార్చి 21న ఉదయం 10 గంటలకు భక్తులకు టికెట్లను అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. మార్చి 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టుదాతల దర్శనం, గదుల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. మార్చి 25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భక్తులకు అందుబాటులోకి రానున్నాయి మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తామని అధికారులు వివరించారు.
అధికారికంగా
మార్చి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. https://ttdevasthanams.ap. gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు. కాగా, నకిలీ బెడద లేకుండా అధికారిక వెబ్ సైట్.. తితిదేవస్థానమ్స్ యాప్ ద్వారా కూడా ఈ సౌకర్యాలు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. టీటీడీ అధికారుల అధికారిక ఈమెయిల్ ఐడీలు టీటీడీ ఈవో: [email protected], [email protected] టీటీడీ అదనపు ఈవో: jeotml@tirumala. org తిరుపతి జేఈవో: jeotpt@tirumala. org ను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications