Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD: తిరుమల శ్రీవారి చుబుకానికి నేటికీ కర్పూర లేపనం వెనుక అనంతాళ్వారు దివ్యగాధ!!

ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు 970వ అవతారోత్సవాన్ని రేపు ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన తిరుమలలో ఘనంగా నిర్వహించనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో టీటీడీ ఈ వేడుకను ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అనంతాళ్వార్‌ 970వ అవతారోత్సవాన్ని ఘనంగా జరపనున్నారు. అసలు ఎవరీ అనంతాళ్వారు అన్నది తెలుసుకుంటే ఆయనకు వేడుకలు ఎందుకు చేస్తారో అర్ధం అవుతుంది.

అనంతాళ్వారు శ్రీవైష్ణవ భక్తుడు. అనంతళ్వారు చైత్రమాసంలో తమిళనాడులో పుట్టినా, ఆయన శ్రీవారి ప్రియభక్తుడు కావటంతో తిరుమలలో ఆయన కాలుమోపిన దినాన్ని అవతారోత్సవంగా వారి వంశీకులు పరిగణిస్తున్నారు. పురాణాల ప్ర‌కారం అనంతాళ్వారు సాక్షాత్తు ఆదిశేషుని రూపంగా చెప్తారు. మరో శ్రీవైష్ణవ భక్తాగ్రేశ్వరుడు శ్రీరామానుజాచార్యులతో కలిసి ఆయన అవిర్భవించినట్లు చెబుతారు. అంతేకాకుండా రామానుజాచార్యుని అభిమతానుసారమే శిష్యుడైన అనంతాళ్వారు తిరుమలకు వేంచేసి స్వామివారి పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టినట్లు కూడా అనేక పురాణ‌కథనాలు ఉన్నాయి.

TTD: Ananta Alwar story behind the camphor ointment even today for Tirumala swamy chin!!

అనంతాళ్వారుకు చెందిన ఒక కథ ప్రాశస్త్యంలో ఉంది. ఒకనాడు అనంతాళ్వారు నిండు గర్భిణియైన తన భార్యతో కలిసి స్వామివారి ఆలయం చెంత ఒక పూలతోటను ఏర్పాటు చేస్తుండగా, వారి ఎదుట బాలుని రూపంలో సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమయ్యాడు. వారికి తోట పనిలో చేదోడు వాదోడు అవుతానని అడిగాడు. అందుకు అనంతాళ్వారు ఒప్పుకోలేదు.

తాను కాదన్నా తన భార్యకు పనులలో చేదోడువాదోడుగా ఉద్యానవన నిర్మాణంలో సహకరించాడన్న కోపంతో అనంతాళ్వారు ఆ బాలునిపై తన చేతిలో ఉన్న గునపాన్ని విసిరాడు. ఆపై మరునాడు స్వామివారి మూలవిరాట్టు చుబుకం నుండి రక్తస్రావం చూసి తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. వచ్చింది సాక్షాత్తు శ్రీవారేనని గుర్తించాడు. వెంటనే స్వామివారి గాయానికి కర్పూరపు ముద్దను అంటించి తన అపారభక్తిని చాటుకున్నాడు. తద్వారా శ్రీవేంకటేశ్వరస్వామివారి కృపకు పాత్రుడయ్యాడు.

నేటికీ స్వామివారి చుబుకానికి కర్పూరాన్ని అంటించడం అనంతాళ్వారు దివ్యగాథను స్ఫురింపచేస్తుంది. అదే విధంగా నేటికీ మహాద్వారం చెంత అనంతాళ్వారు స్వామివారిపై విసిరిన గునపం కూడా భక్తులకు దర్శనమిస్తోంది. అంతటి భక్తుడు అయిన ఆయన అవతారోత్సవం సందర్భంగా ఆయన బోధనలు, రచనలపై సదస్సు నిర్వహిస్తారు.

16 మంది పండితులు పాల్గొని దీనిపై ఉప‌న్య‌సించ‌నున్నారు. రేపు ఉద‌యం 9.30 గంట‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. సాధారణంగా ఈ క్రమంలో దేశవ్యాప్తంగా స్థిరపడిన‌ అనంతాళ్వారు వంశీయులు తిరుమలలోని పురశైవారి తోటలో కలసి ప్రత్యేక పూజలు, దివ్యప్రబంధ పాశుర పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచన‌ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+