10 రోజుల పాటు అలిపిరి శ్రీనివాస టికెట్లు రద్దు
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో శ్రీవారి భక్తులకు కల్పించాల్సిన ఉత్తర ద్వార దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. దీనికోసం ఇటీవలే టీటీడీ పాలక మండలి అత్యవసరంగా సమావేశమైంది కూడా. డిసెంబర్ 30 నుండి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించాలని నిర్ణయించింది. ఉత్తర ద్వార దర్శనంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానించింది.
వైకుంఠ ద్వారం ఏర్పాటైన మొదటి మూడు రోజులు 300 రూపాయలు, శ్రీవాణి కోటా టికెట్ల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. జనవరి 2 వ తేది నుండి 8వ తేది వరకు రోజుకు రూ.300 దర్శన టిక్కెట్లు- 15,000, శ్రీవాణి దర్శన టికెట్లు- 1,000 రెగ్యూలర్ పద్ధతిలో టీటీడీ మంజూరు చేయనుంది. ఇందులో కూడా మొదటి మూడు రోజులకు ఈ- డిప్ ద్వారా టికెట్ల కేటాయింపు ఉంటుంది. ఈ నెల 27 నుండి డిసెంబర్ 1వ తేది వరకు దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించింది. డిసెంబర్ 2వ తేదీన డిప్ ద్వారా ఎంపికైన వారికి టోకెన్లను కేటాయిస్తారు.

టీటీడీ వెబ్ సైట్, యాప్, వాట్సాప్ ద్వారా పారదర్శకంగా టోకెన్ల జారీ, రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది. జనవరి 6, 7, 8 తేదీల్లో తిరుమల, తిరుపతి స్థానికులకు రోజుకు 5,000 టోకెన్లు మంజూరు చేస్తుంది టీటీడీ. ఆన్ లైన్ లో ముందు బుక్ చేసుకున్న వారికి ముందు ప్రాతిపదికన టోకెన్లు అందుతాయి. 10 రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దయ్యాయి.
ఈ క్రమంలో తాజాగా మరో టికెట్లు కూడా రద్దయ్యాయి. అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ తాజా నిర్ణయాన్ని తీసుకుంది. మొత్తం 10 రోజుల పాటు అంటే డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు ఈ విశేష హోమం టికెట్లు భక్తులకు అందుబాటులో ఉండబోవు.
అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీని టికెట్ ధర 1,600 రూపాయలు. ఒక్కో టికెట్ పై ఇద్దరు ఈ హోమంలో పాల్గొనవచ్చు. వారికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ లభిస్తుంది. దర్శనాన్ని విడిగా బుక్ చేసుకోవలసిన అవసరం లేదు. టికెట్లు పొందిన వాళ్లు ఉదయం 8:30 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. హోమం 9 గంటలకు ఆరంభమవుతుంది. రెండు నుంచి రెండున్నర గంటల పాటు కొనసాగుతుంది.
-
తిరుమలలో శ్రీవారి సేవలు మూడురోజుల పాటు రద్దు -
85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications