వైకుంఠ ద్వార దర్శనం కు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా, TTD కీలక సూచనలు..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. సాంకేతికతను వినియోగించుకొని సేవలను పెంపొందించే విధంగా కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి కోసం తిరుమలలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా గా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. సాధారణ భక్తుల కు ప్రాధాన్యత ఇచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. టీటీడీ సూచించిన విధంగా సమయ పాలన చేస్తూ సహకరించాలని భక్తులను కోరుతున్నారు.

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని తెలిపారు. డిసెంబర్‌ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని చెప్పారు. ''మొదటి మూడు రోజులకు ఎలక్ట్రానిక్‌ లక్కీడిప్‌ ద్వారా టోకెన్లు కేటాయించాం. మిగతా ఏడు రోజులు సామాన్య భక్తులకు టోకెన్లు లేకపోయినా సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టిసారించాం. టీటీడీలో ప్రతి విభాగాన్ని పరిశీలిస్తున్నాం. భక్తుల రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఏర్పాట్లు, సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వివరించారు.

ttd-chairman-br-naidu-explains-the-arrangements-for-vaikunta-ekadasi-in-tirumala

దాత మంతెన రామలింగరాజు సహకారంతో పీఏసీలను అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతాం. ఇటీవల రూ.9కోట్లు విరాళంగా ఆయన అందించారని బీఆర్ నాయుడు వెల్లడించారు. ఆలయ ధ్వజస్తంభాల కోసం 100 ఎకరాల్లో టీటీడీ స్వయంగా దివ్య వృక్షాలను పెంచాలని భావిస్తోందని చెప్పారు. పలమనేరులో టీటీడీ గోశాల ఆవరణ వృక్షాల పెంపుదలకు అనువైన స్థలంగా చెప్పు కుచ్చారు. మంగళవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరుగుతుంది. 50 అజెండా అంశాలపై చర్చిస్తామన.. దివ్య వృక్షాల ప్రాజెక్టుపై పాలక మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని బీఆర్‌ నాయుడు తెలిపారు. అంతకుముందు వైకుంఠ దర్శనం, సర్వదర్శనం ద్వారా తిరుమలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం యాత్రిక సముదాయాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+