శ్రీవారి భక్తులకు TTD చైర్మన్ కీలక విజ్ఞప్తి, ఇక నుంచి..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా తాజాగా బోర్డు భేటీలో నిర్ణయాలు తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశి... నూతన సంవత్సరం వేళ దర్శనాల పైన పలు నిర్ణయాలు ప్రకటించారు. ఇదే సమయంలో శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక
విజ్ఞప్తి చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భక్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విరాళం ఇవ్వవద్దని శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. Global Hindu Heritage Foundation, savetemples.org పేర్లతో వ్యవహరిస్తున్న కొందరు వ్యక్తులు తిరుమల, తిరుపతి, తిరుచానూరు ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు నవంబర్ 29న ఒక కార్య క్రమం నిర్వహిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ మోసపూరిత చర్యలతో విరాళాలు సేకరించేందు కు భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ విధమైన అనుమా నాస్పద సంస్థలకు విరాళాలు ఇవ్వకుండా, వారి వలలో పడకుండా భక్తులు అప్రమత్తంగా ఉండా లని విజ్ఞప్తి చేశారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు, భక్తుల విశ్వాసం నిలబెట్టేందుకు కావా ల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

కాగా, తాజాగా టీటీడీ ఈ ఏడాది వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చని ప్రకటించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈసారి సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. పది రోజుల దర్శన కాలంలో మొత్తం 182 గంటల సమయం ఉండగా, అందులో 164 గంటలను సాధారణ భక్తులకే కేటాయించారు. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యే మొదటి మూడు రోజులు (డిసెంబర్ 30, 31, జనవరి 1) రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. ఈ మూడు రోజులకు గాను ఈ-డిప్ లాటరీ పద్ధతిలో టికెట్లను కేటాయించనున్నారు.
ఇందుకోసం నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. డిసెంబర్ 2న లాటరీ ద్వారా ఎంపికైన భక్తులకు టికెట్లు కేటాయిస్తారు. టీటీడీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌తో పాటు వాట్సాప్ ద్వారా కూడా పారదర్శకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15,000 చొప్పున రూ.300 దర్శన టికెట్లను, 1,000 శ్రీవాణి టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. మరోవైపు, తిరుమల, తిరుపతి స్థానిక భక్తుల కోసం జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 చొప్పున ప్రత్యేక టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ పది రోజుల్లో ఏడు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు. కేవలం అత్యవసర ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం కల్పిస్తామని టీటీడీ వెల్లడించింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications