తిరుమల పరకామణిలో చోరీ, మలమార్గంలో విదేశీకరెన్సీ, టీటీడీ ఉద్యోగి చేతివాటం !
తిరుమల/తిరుపతి: తిరుమలలోని నూతన పరకామణి మండపంలో కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు , సీసీటీవీ కెమరాల నిఘా ఏర్పాటు చేయడంతో అక్రమాలకు పాల్పడే వారిని విజిలెన్స్ అధికారులు ఇట్టే గుర్తిస్తున్నారు.
ఇవాళ నోట్ల లెక్కింపు సమయంలో కొన్ని విదేశీ నోట్లను మలమార్గం వద్ద ఉంచుకుని బయటకు వెళుతున్న టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగిని పట్టుకున్నారు.
పరకామణిలోని సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించి విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తనిఖీల్లో నోట్లను గుర్తించి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.

నూతన పరకామణి మండపంలో కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు చెయ్యడం, అడుగడుగునా సీసీటీవీ కెమెరాల నిఘా వుంచడంతో ప్రతి ఒక్కరి కదలికపై సూక్ష్మస్థాయిలో నిఘా ఉంచుతున్నారు.
గతంలోను ఇలాంటి ఘటనలు జరిగినా వెంటనే గుర్తించే వెసులుబాటు ఉండేది కాదు. అయితే నూతన పరకామణి మండపంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన భధ్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో స్వామి సేవ కోసం వచ్చి, చోరీకి పాల్పడుతున్న వారిని వెంటనే గుర్తించగలుగుతున్నారు.
భవిష్యత్త్ లో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కోనసాగుతుందని టీటీడీ భధ్రతాధికారులు స్పష్టం చేశారు. అయితే నియమ నిబంధల కారణంగా పరకామణిలో చోరీ చేసిన కాంట్రాక్టు ఉద్యోగి, పేరు వివరాలు ఇప్పుడే వెళ్లడించలేమని, విచారణ పూర్తి అయిన తరువాత పూర్తి వివరాలు వెళ్లడిస్తామని, గతంలో కూడా ఇతను ఇలాగే చోరీలు చేశాడా అంటూ ఆరా తీస్తున్నామని టీటీడీ విజిలెన్స్ అధికారులు అంటున్నారు.
సర్వసాధారణంగా తిరుమలలో సాటి భక్తుల దగ్గర చోరీలు చెయ్యాలంటేనే చాలా మంది భయపడిపోతుంటారు. తిరుమలలో చోరీలు చేస్తే స్వామివారు కఠినంగా శిక్షిస్తారని భక్తులకు నమ్మకం. అలాంటిది శ్రీవారికి సమర్పించిన హుండి కానుకలు లెక్కించే పరకామణిలో అక్కడ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి చోరీ చెయ్యడంతో సాటి ఉద్యోగులు హడలిపోయారు.












Click it and Unblock the Notifications