Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే సామాన్యులకు అదిరిపోయే శుభవార్త!

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే సామాన్య భక్తులకు శుభవార్త చెప్పేందుకు టీటీడీ సిద్ధమైంది. దశాబ్దాల కాలంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితికి చరమగీతం పాడేందుకు ఏఐ టెక్నాలజీతో టీటీడీ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశ విదేశాల నుండి వచ్చే భక్తులు తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి క్యూలైన్లలో ఇబ్బందులు పడుతున్న క్రమంలో సామాన్య భక్తులకు గంటలోనే దర్శనం కల్పించడానికి టీటీడీ సిద్ధమైంది.

టీటీడీ తీర్మానం అమలుకు కసరత్తు మొదలు
టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన నాడే తిరుమల స్వామివారిని గంటలోగా దర్శించుకునే వెసులుబాటు కల్పిస్తామని సంచలన ప్రకటన చేసి శుభవార్త చెప్పారు. ఇక ఆ మాట మేరకు ప్రస్తుతం కేవలం గంట వ్యవధిలోనే స్వామివారి దర్శనాన్ని కల్పించడం కోసం టిటిడి పాలకమండలి ఇటీవల చేసిన తీర్మానాన్ని అమలు చేయడానికి కసరత్తు మొదలైంది.

TTD good news ttd key steps on AI technology Tirumala Balaji darshan in just one hour

డిజి లాకర్ తరహాలో టోకెన్
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వెళ్ళిన భక్తులకు శీఘ్రదర్శనం కల్పించడం కోసం మొదటగా వారి ఆధార్ కార్డు నెంబరుతో, ఫేస్ రికగ్నైజేషన్ తో కూడిన రసీదును అందించడం కోసం శ్రీవారి దర్శన సమయాన్ని సూచిస్తూ డిజి లాకర్ తరహాలో ఒక టోకెన్ ను అందిస్తారు.

ఫేస్ రికగ్నిషన్ ఎంట్రన్స్ ద్వారా గంటలోనే దర్శనం
ఈ టోకెన్ అందుకున్న భక్తులు వారికి సూచించిన సమయానికి నేరుగా వైకుంఠంలో క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకుంటే అక్కడ ఏర్పాటు చేసిన పేస్ రికగ్నైజేషన్ ఎంట్రెన్స్ ద్వారా స్కానింగ్ పూర్తిచేసుకుని నేరుగా క్యూ లైన్ లోకి వెళ్లి త్వరితగతిన స్వామివారిని దర్శించుకుంటారు. ఈ విధానంలో కేవలం గంటలోనే స్వామి దర్శనం దొరుకుతుంది.

విమానాశ్రయాల తరహాలో తిరుమలలో డిజీ లాకర్స్
అయితే ఈ డిజి లాకర్ టోకెన్లను భక్తులకు సరిపడా ఇవ్వడం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద 30 కౌంటర్లను మరో 30 స్కానింగ్ పేస్ రికగ్నైజేషన్ ఎంట్రన్స్ లను ఏర్పాటు చేస్తారు. విమానాశ్రయాల తరహాలో సిబ్బందితో పని లేకుండా ఆటోమేటిక్ గా పనిచేసే డిజి లాకర్ పద్ధతిని తీసుకు వస్తే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కేవలం గంట సమయంలో గానే శ్రీవారి దర్శనం భక్తులకు కల్పించే అవకాశం ఉంటుంది.

టీటీడీ అధికారులకు వారం రోజులపాటు ప్రజెంటేషన్
అయితే ఈ విధానం అమలు చేయడం కోసం కావలసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ను అందించడం కోసం నాలుగు విదేశీ సంస్థలు ముందుకు వచ్చాయి.. ఈ సంస్థలు నేటి నుంచి వారం రోజుల పాటు టీటీడీలో అమలు చేయనున్న ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రొజెక్టర్ ప్రజెంటేషన్ ద్వారా టిటిడి ఉన్నతాధికారులకు చూపించనున్నారు.

సాఫ్ట్ వేర్ కంపెనీలతో ఒప్పందం
వారం రోజుల పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పూర్తి అవగాహన కలిగిన తర్వాత ఈ నాలుగు సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి ఈ మేరకు ఒప్పందం చేసుకుంటారు. ఆపై మూడు మాసాలలోగా భక్తులకు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక ఈ మేరకు తిరుమలకు వస్తున్న భక్తులసంఖ్య వారినుంచి సేకరిస్తున్న సమాచారం తదితర పూర్తి వివరాలను సదరు సాఫ్ట్ వేర్ సంస్థలకు టీటీడీ అందిస్తుంది.

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ విధానం సక్సెస్ అయితే గంటలోనే దర్శనం
ఇక ఇప్పటికే ఈ మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తులకు కేవలం గంటలోపే శ్రీవారి దర్శనం కల్పించే నూతన విధానం టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలిసి పూర్తి వివరాలను చర్చించారు. కేవలం గంటలోపు సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ విధానం సక్సెస్ అయితే టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు పేరు టీటీడీ చరిత్రలో నిలిచిపోతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+