Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD: శ్రీ కపిలేశ్వరాలయంలో కన్నులపండుగగా మహా శివరాత్రి మహోత్సవం.. విశేషాలివే!!

కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడు కొండలపై కొలువుతీరిన తిరుమల శ్రీవారికి అనుబంధంగా ఉన్న అనేక ఆలయాలలోనూ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుపతి శేషాచల పర్వత మూలంలో వెలసిన కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1వతేదీ నుండి 10వ తేదీవరకు అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి. అయితే ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 8వ తేదీన కపిలేశ్వర స్వామివారికి మహాశివరాత్రి మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.

ఇప్పటికే మార్చి 1 నుండి బ్రహ్మోత్సవాల సందర్భంగా కపిలేశ్వర స్వామి వారికి ఉదయం ప్రతిరోజు 7 గంటల నుండి 9 గంటల వరకు, అలాగే రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరగుతున్నాయి.మార్చి ఒకటవ తేదీన ఉదయం ధ్వజారోహణం నిర్వహించి, రాత్రి స్వామివారు హంస వాహనంపై ఊరేగారు.

TTD Maha Shivratri Mahotsavam as Eye Festival in Tirupati Sri Kapileswara Temple

మార్చి రెండవ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. మార్చి 3వ తేదీన ఉదయం భూత వాహనంపై, రాత్రి సింహ వాహనంపై స్వామి ప్రజలను స్వామి కతాక్షించారు. మార్చి 4వ తేదీన ఉదయం మకర వాహనంపై, రాత్రి శేష వాహనంపై స్వామివారు భక్తులను కరుణించారు.

మార్చి 5వ తేదీన తిరుచ్చి ఉత్సవం జరగగా, అధికార నంది వాహనం పైన స్వామి కనువిందు చేశారు. మార్చి ఆరవ తేదీన ఉదయం వ్యాఘ్ర వాహనంపై, గజ వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. మార్చి 7వ తేదీన ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కాగా రేపు మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8వ తేదీన ఉదయం రథోత్సవం, భోగి తేరు జరగనుంది.

రేపు రాత్రి కపిలేశ్వర స్వామి నంది వాహనంపై ఊరేగుతారు. మహా శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రత్యేకంగా క్యూ లైన్లు, చలువ పందిళ్ళు, పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి నాడు తెల్లవారుజామున 2.30 గంటల నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు కపిలేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 7గంటల నుండి 9గంటల వరకు రథోత్సవం నిర్వహిస్తారు.

ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఉత్సవ మూర్తులకు స్నపనతిరుమంజనం చేపడతారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నందివాహన సేవ నిర్వహిస్తారు. అంతేకాదు కపిలేశ్వర స్వామివారికి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే సాయంత్రం 4.30 నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

మార్చి 9వ తేదీ శ‌నివారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకాలు నిర్వహిస్తారు. మార్చి 9వ తేదీన ఉదయం పురుషామృగవాహనంపై ఊరేగే స్వామికి, సాయంత్రం కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆపై రాత్రి తిరుచ్చి ఉత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంది. మార్చి 10వ తేదీ ఉదయం త్రిశూల స్నానం మరియు యంత్రం ధ్వజావరోహణం, రాత్రి రావణాసురుని సంహారం నిర్వహిస్తారు.

ఇక కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజు విభిన్న కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కోలాటాలు, భజన కార్యక్రమాలతో పాటు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించి బ్రహ్మోత్సవాలలో భక్తి భావాన్ని నింపనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+