TTD: రమణ దీక్షితులుపై వేటు: స్పందించిన నారా లోకేష్
తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు పదవి నుండి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి రమణ దీక్షితులును తొలగించిన విషయం తెలిసిందే. టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలకు ఆయనను పదవి నుండి తొలగిస్తూ టీటీడీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. టీటీడీ అధికారులు, పాలకమండలి, జియ్యంగార్లు, అర్చకులతోపాటు అహోబిల మఠంపై నిందారోపణలు చేసిన గౌరవ ప్రధానార్చకులు రమణదీక్షితులను ఉద్యోగం నుండి తొలగించాలని బోర్డు సమావేశంలో తీర్మానం చేశారు.
ఇక ఈ క్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టిటిడి తీసుకున్న ఈ నిర్ణయం పై స్పందించారు. తిరుమల ప్రతిష్ట దెబ్బతినేలా వైసిపి నేతల అకృత్యాలు పెరిగిపోతున్నాయని నారా లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల అకృత్యాలను బయటపెట్టిన అర్చకులు రమణ దీక్షితులుపై వేటు వేయడం బాధాకరమని మాజీమంత్రి, టిడిపి కీలక నేత నారా లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

తిరుమలలో జరుగుతున్న దారుణాలను భక్తులకు తెలిసేలా రమణ దీక్షితులు చెప్పారని ఆయన పేర్కొన్నారు. తిరుమల కొండపై టిటిడి అధికారులతో పాటు వైసీపీ నేతలు కలిసి దారుణాలకు ఒడిగడుతున్నారు అంటూ లోకేష్ మండిపడ్డారు. నియంత పాలనలో నోరు విప్పడం నేరమే అంటూ.. ఆయనపై వేటు వేయటం బాధ కలిగించిందని అన్నారు. దైవంతో ఆటలాడవద్దని సీఎం జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు.
నియంత పాలనలో నోరువిప్పడం నేరమే! తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వైసిపి నాయకులు చేస్తున్న అకృత్యాలను బయటపెట్టిన ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారిపై వేటు వేయడం దారుణం. కొండ పై వైసిపి నేతలు, కొంత మంది అధికారులు కలిసి చేస్తున్న దారుణాల గురించి ఆ కలియుగ దైవమే రమణ… pic.twitter.com/DFEfzUHwU6
— Lokesh Nara (@naralokesh) February 26, 2024
కొండపై వైసీపీ నేతలు, కొంతమంది అధికారులు కలిసి చేస్తున్న దారుణాలను ఆ కలియుగ దైవమే రమణ దీక్షితులు నోటి నుండి భక్తులకు తెలిసేలా చేసిందని లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసిపి పాలకులు చేసిన తప్పులకు, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది పోయి, ఆయనపై కేసు పెట్టడం, ఆయనను అరెస్టు చేయాలని చూడడం జగన్ అహంకారానికి నిదర్శనమని లోకేష్ మండిపడ్డారు. దేవుడు జోలికి వెళ్ళిన వాళ్ళు బాగు పడినట్లు చరిత్రలో లేదని లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications