ఆ ఐదు రోజులు తిరుమల దర్శనం వాయిదా వేసుకోండి: భక్తులకు టీటీడీ

తిరుపతి: తిరుమలలో భక్తీల రద్దు కొనసాగుతోంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు క్యూకట్టారు. అంతేగాక, ఆగస్టు 11 నుంచి 15 వ తేదీ వ‌ర‌కు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని టీటీడీ అంచనా వేస్తోంది.

భ‌క్తులు ప్రణాళిక బ‌ద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్‌ చేసుకుని తిరుమల కు రావాలని టీటీడీ కోరుతోంది. వేసవి రద్దీ తగ్గినప్పటికీ, వారాంతం రద్దీ తో పాటు పండుగ తో కూడా వ‌రుస సెలవులు ఆగస్టు 19 వరకు కొనసాగుతాయి. పైగా పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబర్ 18న‌ ప్రారంభమై అక్టోబర్ 17వ తేదీ ముగుస్తుంది.

ఈ మ‌ధ్య కాలంలో తిరుమ‌ల యాత్రికుల ర‌ద్ధీ అనూహ్యంగా పెరిగే అవ‌కాశం ఉంది. ఈ కార‌ణంగా వృద్ధులు, చిన్న పిల్ల‌ల త‌ల్లిదండ్రులు, వికలాంగులు తిరుమ‌లకు పెరటాసి మాసం అనంతరం రావలసిందిగా టీటీడీ విజ్ఞ‌ప్తి చేస్తోంది.

TTD requested to postpone devotees their pilgrimage from August 11-15, due to heavy rush in tirumala

అధిక రద్దీ ఉన్న రోజుల్లో యాత్రికులను వారి నిర్దేశిత సమయాలలో మాత్రమే దర్శనానికి అనుమతించడం జ‌రుగుతుంది. యాత్రికులు దర్శనం కోసం తమ వంతు వ‌చ్చే వరకు కంపార్ట్‌మెంట్లలో మరియు క్యూ లైన్లలో చాలా గంటలు వేచి ఉండటానికి సంసిద్ధత మరియు ఓపికతో రావాల‌ని టీటీడీ విజ్ఞ‌ప్తి చేస్తోంది.

ఆగ‌స్టు 11న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం ఆగ‌స్టు 11వ‌ తేదీ గురువారం ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+