Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రమణదీక్షితులుకు గండం: ప్రధాన అర్చకులు ఆ నాలుగు కుటుంబాల నుంచే

తిరుమల: టిటిడి ఆలయ ప్రతిష్టను మంటగలుపుతున్నారనే విమర్శలు రావడంతో పాటు నిత్యం ఏదో వివాదాల్లో రమణదీక్షితులు పేరు విన్పిస్తోంది. కొంత కాలంగా రమణదీక్షితులు వ్యవహరశైలి వివాదాస్పదంగా ఉంటుందనేది వైరివర్గం ఆరోపనలు చేస్తోంది. నిబంధనలకు విరుద్దంగా రమణదీక్షితులు వ్యవహరిస్తోన్నా టిడిపి అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందనే భావనలు వ్యక్తం చేస్తున్నారు వైరివర్గం. స్వామివారికి సేవ చేసే భాగ్యం నాలుగు కుటుంబాలకే వంశపారంపర్యంగా వస్తోంది.

ఆపద మొక్కుల వాడుగా తిరుపతి వెంకటేశ్వరస్వామికి పేరుంది. దీంతో పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకొనేందుకు భక్తులు వస్తుంటారు.అయితే టిటిడిలో ప్రధాన అర్చకుడిగా పనిచేయడం అందరీకీ సాధ్యమయ్యేది కాదు.

ప్రధాన అర్చకుడిగా సేవలు అందించాలంటే నాలుగు కుటుంబాలకు చెందినవారికే ఈ అర్హత దక్కుతోంది.అయితే ప్రస్తుతం ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులు వ్యవహరశైలిపై ఇటీవల కాలంలో విమర్శలు వెల్లువెత్తడంతో టిటిడి చర్యలకు ఉపక్రమించింది.

రమణదీక్షితులు వ్యవహరంపై వైరి వర్గం టిటిడి అధికారులకు ఫిర్యాదులు చేసింది. అంతేకాదు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళినట్టుగా ప్రచారం సాగుతోంది. దరిమిలా రమణదీక్షితులపై చర్యలుంటాయా ఉండవా అనే చర్చ కూడ జోరుగా సాగుతోంది.

నాలుగు కుటుంబాలకే అర్చక సేవ

నాలుగు కుటుంబాలకే అర్చక సేవ

తిరుమల వెంకన్న సేవ చేసే భాగ్యం కేవలం నాలుగు కుటుంబాలకు చెందిన అర్చకులకు మాత్రమే స్వామి వారికి సేవ చేసే అదృష్టం వంశపారంపర్యంగా వస్తోంది.

వెంకన్న సేవలో పనిచేసే అర్చకులంతా చూసేందుకు ఒకేళా కనిపించినా అందరూ ఒకటి కాదు. మూలవిరాఠ్‌ను తాకడంతో పాటు శ్రీవారికి సుప్రభాతంతో నిదుర లేపి ఏకాంత సేవ నుంచి పవలింపు సేవ వరకు స్వామివారికి దగ్గరుండి సేవ చేసే కుటుంబాలు నాలుగు ఉన్నాయి. స్వామివారికి ప్రత్యేక్షంగా సేవ చేసే భాగ్యం ఈ నాలుగు కుటుంబాలకే ఉంది. అయితే వీరికి సహాయకులుగా మరికొందరు అర్చకులు ఉంటారు. వీరు సంభావణ అర్చకులుగా కొనసాగుతారు.

ఎందుకు ఆ నాలుగు కుటుంబాలకే ఆ బాధ్యతలు?

ఎందుకు ఆ నాలుగు కుటుంబాలకే ఆ బాధ్యతలు?

తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారు పుట్టలో వెలిశారు. తొలుత గోపీనాథ్ దీక్షితులు అనే అర్చకుడు ఈ విషయాన్ని గుర్తించారు. తర్వాతి కాలంలో పుట్టలోని స్వామివారికి నిత్యం పూజలు చేసేవారు గోపీనాథ్ దీక్షితులు.ఇలా తిరుమలలో స్వామివారిని తొలిసారిగా గుర్తించినందుకే అప్పటి నుంచి శ్రీవారికి పూజ చేసే అర్హత గోపీనాథ్ దీక్షితులుకు దక్కింది. తర్వాతి కాలంలో గోపీనాథ్ దీక్షితులు వంశం నుంచి పెద్దింటి వంశం, గొల్లపల్లి వంశం, పైడిపల్లి వంశం, తిరుపతమ్మ వంశం ఈ నాలుగు కుటుంబాలే తరతరాలుగా స్వామివారికి నిత్య కైంకర్యాలు చేస్తూ వస్తున్నాయి.

గొల్లపల్లి వంశం నుండి రమణదీక్షితులు

గొల్లపల్లి వంశం నుండి రమణదీక్షితులు

ఈ నాలుగు కుటుంబాల్లో ప్రస్తుతం పెద్దింటి వంశం నుంచి శ్రీనివాస దీక్షితులు, గొల్లపల్లి వంశం నుంచి రమణ దీక్షితులు, పైడిపల్లి వంశం నుంచి నారాయణ దీక్షితులు, తిరుపతమ్మ వంశం నుంచి నరసింహా దీక్షితులు ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్నారు. వీరందరూ దాదాపు గత 36 తరాలుగా స్వామివారిని పూజిస్తున్నారు. ప్రస్తుతం ఈ నాలుగు కుటుంబాల నుంచి 25 మంది అర్చకులుగా కొనసాగుతుంటే వీరికి సహాయకులుగా సంభావన అర్చకుల హోదాలో మరో 45 మంది పనిచేస్తున్నారు.

ప్రధాన అర్చకులు ఏం చేస్తారంటే?

ప్రధాన అర్చకులు ఏం చేస్తారంటే?

ఈ నాలుగు కుటుంబాలు మాత్రమే గర్భాలయంలోకి వెళ్లి స్వామివారిని ముట్టుకోవడంతో పాటు నిత్య కైంకర్యాలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించడానికి అర్హత ఉంది. ఇక ప్రతీ శుక్రవారం స్వామివారి అభిషేక సేవ సమయంలో ఈ నాలుగు కుటుంబాలకు చెందిన అర్చకులే వంతులవారీగా( రొటేషన్ పద్దతిన) స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. ప్రస్తుతం నెలకు ఒక్క కుటుంబం చెప్పున ఆలయ అర్చకులకు డ్యూటీలు వేస్తుంటారు.

మిరాశీ వ్యవస్థ రద్దు చేసిన ఎన్‌టిఆర్

మిరాశీ వ్యవస్థ రద్దు చేసిన ఎన్‌టిఆర్

1983కి పూర్వం ఈ నాలుగు కుటుంబాల ఆధ్వర్యంలో స్వామి నిత్య కైంకర్యాలు జరిగేవి. ఈ నాలుగు కుటుంబాల భుక్తి కోసం ఆలయంలో వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని కేటాయించే ఆచారం ఉండేది. 1983లో ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్టీఆర్ వచ్చిన తర్వాత మిరాశీ వ్యవస్థను రద్దు చేశారు. దీంతో అప్పటి వరకు ఆలయ పూజల్లో హక్కుదారులు అయిన ఈ నాలుగు కుటుంబాలు ఉద్యోగస్తులుగా మారిపోయారు.. అయితే తర్వాతి కాలంలో అర్చకులు కోర్టుకు వెళ్లడంతో అర్చకుల వంశపారంపర్య హక్కులను గుర్తించాల్సిందింగా కోర్టు సూచించింది. దీంతో ఈ నాలుగు కుటుంబాల నుంచి నలుగురిని ప్రధాన అర్చకులుగా టీటీడీ గుర్తించింది.దీంతో ప్రస్తుతం టీటీడీ శ్రీవారి ఆలయంలో నలుగురు ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్నారు. అయితే శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా నియమించాలంటే ఈ నాలుగు కుంటుంబాలకు చెందిన వారినే నియమించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నాలుగు కుటుంబాల్లో పెద్ద వారిని ప్రధాన అర్చకులుగా గుర్తించే సాంప్రదాయాన్ని టీటీడీ పాటిస్తోంది. దీనిలో భాగంగానే ప్రస్తుతం శ్రీనివాస్ దీక్షితులు, రమణ దీక్షితులు, నారాయణ దీక్షితులు, నరసింహ దీక్షితులు ప్రధాన అర్చకులుగా ఉన్నారు.

నాలుగు వేదాల్లో ఏదో ఒకటి నేర్చుకొంటేనే ప్రధాన అర్చకుడిగా విధులు

నాలుగు వేదాల్లో ఏదో ఒకటి నేర్చుకొంటేనే ప్రధాన అర్చకుడిగా విధులు

ప్రధాన అర్చకులతో పాటు స్వామి వారి కైంకర్యాలతో పాలు పంచుకోడానికి ఈ నాలుగు కుటుంబాల్లోని వారిని సంభావణ అర్చకులుగా టీటీడీ గుర్తించింది. ఆలయంలో క్రతువుల కింద సంభావణ కింద నగదు చెల్లిస్తుంది టీటీడీ. ఒకవేళ ఈ కుటుంబాల నుంచి ప్రధాన అర్చకులు వయసు రీత్యా పనిచేయలేని స్థితి వస్తే ఈ కుటుంబంలో వయసు రీత్యా పెద్ద వ్యక్తికే ప్రధాన అర్చకుల హోదా ఇస్తుంది టిటిడి. అయితే ప్రధాన అర్చకులు కావాలంటే ఖచ్చితంగా వైఖానస ఆగమంతో పాటు నాలుగు వేదాల్లో ఏదో ఒక వేదం నేర్చుకుని ఉండాలి.

శ్రీవారి పాదసేవ చేస్తేనే గర్భాలయంలోకి ప్రవేశం

శ్రీవారి పాదసేవ చేస్తేనే గర్భాలయంలోకి ప్రవేశం

ఆగమ శాస్త్రంలో చెప్పిన విధంగా నిర్ణీత వయసు వచ్చిన తర్వాత శ్రీవారి పాదసేవ అనే కార్యక్రమం నిర్వహించిన తర్వాతే గర్భాలయంలోకి ప్రవేశించే అర్హతను సాధిస్తారు ఈ నాలుగు కుటుంబాల అర్చకులు. తమ పిల్లలకు గర్భాలయంలోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా శ్రీవారి పాదసేవ కార్యక్రమం పూర్తి చేయాలి. ఈ నాలుగు కుటుంబాల్లోని ఓ కుటుంబం శ్రీవారి గోవిందరాజస్వామి ఆలయంలోనూ సేవలందించాల్సి ఉంటుంది. ఇలా తరతరాలుగా ఈ నాలుగు కుటుంబాలు శ్రీవారి నిత్య పూజా కైంకర్యాలను నిర్వహిస్తున్నాయి.

వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావాలని యాగం చేసిన రమణ దీక్షితులు

వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావాలని యాగం చేసిన రమణ దీక్షితులు

2003లో వైఎస్ సీఎం కావడం కోసం తిరుమలలోని తన స్వగృహంలో యాగాన్ని నిర్వహించడం అప్పట్లో వివాదాస్పదమైంది.2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో రమణ దీక్షితులుకు తిరుగులేకుండా పోయింది. టీటీడీ అధికారులతో పాటు పాలకమండలి కూడా రమణ దీక్షితులు విషయంలో జోక్యం చేసుకునే సాహసం చేసేవారు కాదు. మిగిలిన ముగ్గురు ప్రధాన అర్చకుల్లో ఒక్కరు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తూ ఉండటం. మరో ఇద్దరు అసలు ఆలయ విధులకు హాజరుకాకపోవడంతో రమణ దీక్షితులకు అడ్డులేకుండా పోయింది.

రమణ దీక్షితులు హవా

రమణ దీక్షితులు హవా

శ్రీవారి ఆలయ విధులు, కైంకర్యాల బాధ్యతనంతా తానే చూసుకుంటూ ఉండటంతో టీటీడీలో రమణ దీక్షితులు హవా కొనసాగింది. తన మాటే వేదం, చెప్పిందే శాస్త్రం అన్న విధంగా రమణ దీక్షితులు హవా టీటీడీలో కొనసాగడంతో పాటు తన వారికి అధిక ప్రాధాన్యతలు ఇస్తూ, స్వామి అభిషేక విధులు, ఉత్సవాల కైంకర్యాల నిర్వహణకు విధులు కేటాయిస్తూ ఉండటంతో రమణ దీక్షితులకు వ్యతిరేక వర్గం తయారరైందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే చేసేది లేక వైరి వర్గం మిన్నకుండిపోయింది. దీంతో ఆలయ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆయనపై చర్యలు తీసుకునే నాధుడే కరువయ్యారు.

తొలి నుండి వివాదాస్పదమే

తొలి నుండి వివాదాస్పదమే

తిరుమలలోని తన ఇంట్లో ప్రైవేట్ హోమం నిర్వహించినప్పుడే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కోసం 2003 సంవత్సరం చివర్లో ఏకంగా తన గృహంలో హోమాన్ని నిర్వహించడం తీవ్రసంచలనం అయ్యింది. తిరుమలలో శ్రీవారికి మినహా ఇతర చోట్ల హోమాలు నిర్వహించడం నిషిద్ధమైనప్పటికీ ఆలయ ప్రధాన అర్చకుడు ఏకంగా తన స్వగృహంలోనే హోమం నిర్వహించారు. మిరాశీ వ్యవస్థను కొనసాగించాలంటూ రమణ దీక్షితులు కోర్టును ఆశ్రయించి టీటీడీ తీరును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఇప్పటికీ ఈ వివాదం కోర్టులో కొనసాగుతోంది. ఇక వ్యాపార దిగ్గజం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తిరుమలకు వచ్చినప్పుడల్లా ఆయన అతిథి గృహం వద్దకు వెళ్లి పలుమార్లు ఆశీర్వచనం చేయడంపై కూడా వివాదం రేగింది.ఈ అంశంపై 2009లో అప్పటి ఈవో కృష్ణారావు ఆయనపై నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ చర్యలు తీసుకునేందుకు అధికారులు సాహసం చేయలేదు. రేమాండ్స్ అధినేతతో పాటు, క్రికెటర్ రవిశాస్త్రి పలువురు రాజకీయ నాయకులకు కూడా తిరుమలలో ప్రైవేటు ఆశీర్వచనాలు చేసినప్పటికీ టీటీడీ అధికారులు చూసీచూడనట్లు మిన్నకుండిపోయారు.

అర్చకుల హవాకు చెక్ పెట్టేందుకు సాంబశివరావు ప్రయత్నాలు

అర్చకుల హవాకు చెక్ పెట్టేందుకు సాంబశివరావు ప్రయత్నాలు

కొన్నేళ్ళుగా టీటీడీ అర్చకులు, అధికారులు మధ్య తీవ్ర స్థాయిలో వివాదాలు నడుస్తున్నాయి. అర్చకుల ఏకఛత్రాధిపత్యానికి ఫు‌ల్‌స్టాప్ పెట్టేందుకు గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన సాంబశివరావు నడుం బిగించారు. దేవస్థానం బోర్డు నియమనిబంధనలను పాటించకుండా వ్యవహరిస్తున్న వారికి చెక్‌పెట్టేందుకు ఇతర అర్చకులకు అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా గత ఏడాది జరిగిన శ్రీవారి పవిత్రోత్సవాలతో పాటు బ్రహ్మోత్సవాలకు వేదపాఠశాలలోని అవధానికి కంకణధారణ చేసే అవకాశం కట్టబెట్టారు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు తన అనుచర అర్చకులతో తమకు జరిగిన అన్యాయం అని తెలుపుతూ హైకోర్టులో పిల్ వేయించారు. హైకోర్టులో వాదనల సమయంలో టీటీడీ లాయర్ ప్రశ్నలకు జవాబులు చెప్పలేని అర్చకులు తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

నిబంధనలకు విరుద్దంగా మహద్వారం గుండా ఆలయప్రవేశం

నిబంధనలకు విరుద్దంగా మహద్వారం గుండా ఆలయప్రవేశం

గతేడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో తన మనవడితో కలిసి మహాద్వారం గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు రమణ దీక్షితులు.

నైవేద్య విరామ సమయంలో ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా స్వామివారికి కైంకర్యాలు, నైవేద్యం జరిగే సమయంలో ఆలయంలో విధులు నిర్వహించే అర్చకులకు మినహా ఎవరికీ అనుమతి ఉండదు. అయితే నిబంధనలు ఉల్లంఘిస్తూ తన మనవడిని తీసుకుపోవడంతో ఆలయ అధికారులు వివరణ ఇవ్వాల్సిందిగా రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేశారు. ఆ తరువాత సూర్యప్రభ వాహన సేవ విధులను ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన నరసింహ దీక్షితులు, వేణుగోపాల దీక్షితులకు కేటాయించగా, సూర్యప్రభవాహనం వాహన విధులను తానే నిర్వహిస్తానని వేణుగోపాల దీక్షితులను తరిమివేసి మరీ విధులను నిర్వర్తించారు.

అర్చకులపై తీవ్ర విమర్శలు

అర్చకులపై తీవ్ర విమర్శలు

ఇక ఈ ఏడాది శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగుతున్న సమయంలో శ్రీవారి ఆలయంలో ఆగమ నిబంధనలు పాటించడం లేదని ఆగమాలు తెలియనివారితో ఉత్సవాలు జరిపిస్తున్నారని, అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రమణ దీక్షితులు రాష్ట్ర రాజధాని అమరావతిలో టీటీడీ అర్చకులపై తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్లుగా ఆలయ విధులకు దూరంగా ఉంటూ టీటీడీ నోటీసులకు కూడా స్పందించని తన కుమారుడైన వెంకటపతి కుమార దీక్షీతులకు సూర్యప్రభవాహన సేవ విధులను కేటాయించి మరో వివాదానికి కేంద్ర బింధువుగా నిలిచారు.ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన టీటీడీ అధికారులు అతికష్టం మీద అతడిని విధుల నుంచి తప్పించి మరొకరికి కేటాయించారు. ఆలయ ప్రధాన అర్చకుడిగానే కాక, ఆగమ సలహాదారుడిగా ఉంటూ ఆలయ నియమ నిబంధనలు తెలిసిన రమణ దీక్షితులు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో రెండేళ్లుగా ఆలయ విధులకు దూరంగా ఉంటున్న తన కుమారుడు మనవళ్లతో కలిసి మహాద్వారం గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. విధులకు దూరంగా ఉండి రేపోమాపో టీడీపీ క్రమశిక్షణా చర్యలు తీసుకోబోతున్న వ్యక్తిని శ్రీవారి గర్భాలయంలోకి తీసుకువెళ్లి హారతులు ఇప్పించారు. వీఐపీ బ్రేక్ సమయంలో భక్తులకు హారతి ఇవ్వడాన్ని చూసిన ఆలయ డిప్యూటీ ఈవో కోదండరామారావు అతడిని లోపలికి ఎవరు అనుమతించారంటూ సిబ్బందిపై మండిపడ్డారు.

సీసీటీవి పుటేజీని ఆధారంగా నోటీసులు

సీసీటీవి పుటేజీని ఆధారంగా నోటీసులు

రమణ దీక్షితులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడంపై టిటిడి సీరియస్ అయింది. సీసీటీవీ విజువల్స్‌ను పరిశీలించిన అధికారులు రమణ దీక్షితులు మహాద్వారం గుండా తన మనవళ్లు, కుమారులతో ప్రవేశించినట్లు గుర్తించారు. ఇక శ్రీవారి మూల విరాట్‌కు కూడా వెంకటపతి కుమార దీక్షితులు హారతులిచ్చినట్టు నిర్ధారించారు. ఈ మేరకు నేడో రేపో టీటీడీ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నారు. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రమణ దీక్షితులు ఎన్నిసార్లు నియమనిబంధనలు ఉల్లంఘించినా కనీసం ప్రశ్నించే సాహసం కూడా ఎవరూ చేయలేదు. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రమణ దీక్షితులుపై చర్యలు తీసుకోకపోయినా ఆయనను ప్రశ్నించే సాహసాన్ని టీటీడీ అధికారులు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+