Tirumala: తిరుమలలో శ్రీవారి భక్తులకు అరుదైన అవకాశం..!!

తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ అరుదైన అవకాశం కల్పించింది.

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకీ పెరుగుతోంది. శ్రీవారి దర్శనంతో పాటుగా సేవల్లో తరించేందుకు వేలాది భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. ఇదే సమయంలో కాలానుగుణంగా తిరుమలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మూడు శతాబ్దాలకు పైగా తిరుమలలో ప్రత్యేకంగా నిపుణులు ఆలయ నియమాలకు అనుగుణంగా తయారు చేసే లడ్డులు త్వరలో మిషన్ల ద్వారా తయారు కానున్నాయి.

అదే సమయంలో నిత్యం వేలాది మంది భక్తులు శ్రీవారికి హుండీ ద్వాకా కానుకలు సమర్పిస్తారు. తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇప్పుడు ఆ హుండీలకు సంబంధించి పరాకమణికి నూతన భవనంలో నేటి నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో భక్తులకు అరుదైన అవకాశం కల్పించారు.

శ్రీవారి పరాకమణి విశిష్ఠత

శ్రీవారి పరాకమణి విశిష్ఠత

శ్రీవారిని దర్శంచుకున్న తరువాత ప్రసాదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. కానుకలు చెల్లింపు అంతే ప్రాధాన్యత ఇస్తారు. నిత్యం శ్రీవారి హుండీ ఆదాయం కోట్లాది రూపాయల్లో ఉంటుంది. తాజాగా ఈ హుండీ ఆదాయం రికార్డులు తిరగరాసింది. హుండీ ద్వారా వచ్చిన ఆదాయం లెక్కించటానికి నిరంతరం శ్రీవారి సన్నిధిలో పరాకమణిలో సిబ్బంది పని చేస్తారు.

తిరుమల చరిత్రలో 1965 వరకు బంగారు వాకిలి వద్దనే.. శ్రీవారి హుండీ ఆదాయాన్ని లెక్కిస్తూ వచ్చారు. ఆ తర్వాత సంపంగి ప్రాకారము వద్దకు మార్చారు. అయినా.. హుండీ లెక్కింపులో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే కాయిన్ల లెక్కింపును తిరుపతికి మళ్లించారు. రోజూ ప్రత్యేక వాహనంలో తిరుపతి పరిపాలనా భవనానికి చిల్లర నాణేలను తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆదాయం.. 15 గంగాళాలు సరిపడా వస్తోంది. దీంతో ప్రస్తుతం ఉన్న పరకామణి భవనం స్థలం సరిపోకపోవడంతో.. తాజాగా సరికొత్త పరకామణి భవన నిర్మాణం పూర్తి చేసారు.

కొత్త పరాకమణి భవనం ప్రారంభం

కొత్త పరాకమణి భవనం ప్రారంభం

దీంతో ప్రస్తుతం ఉన్న పరకామణిలో కానుకలు లెక్కింపు ఆలస్యం అవుతుండడంతో.. పరకామణిని బయటకు తరలించాలని టీటీడీ నిర్ణయించింది. బెంగళూరుకు చెందిన దాత.. మురళీకృష్ణ సహాయంతో 23 కోట్లతో.. 22 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం ఎదురుగా రెండస్తుల్లో కొత్త పరకామణి భవనాన్ని నిర్మించారు. ముఖ్యమంత్రి జగన్ తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో కొత్త భ‌వనానికి ప్రారంభోత్స‌వం చేశారు.

అత్యంత ఆధునికంగా పటిష్ట భద్రత ఏర్పాట్లతో ఈ భవనాన్ని నిర్మించారు. కానుకలు లెక్కించే సమయంలో భక్తులు చూసే విధంగా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను అమర్చారు. అంతేకాదు.. అత్యాధునిక నగదు లెక్కింపు యంత్రాలను కూడా వినియోగించనున్నారు. నోట్ల ద్వారా వచ్చే దుమ్మను అరికట్టే యంత్రాలు, బంగారు, వెండి కానుకలను భద్రపర్చే స్ట్రాంగ్ రూమ్‌లు సిద్దం చేసారు. ఇక, ఈ రోజు ఈ కొత్త భవనంలోనే శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు ప్రారంభించారు.

భక్తులకు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం

భక్తులకు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం

ఈ రోజు కొత్త భవనంలో ప్రత్యేక పూజలు చేసి పరాకమణి భవనంలోకి హుండీలను తరలించారు.ప్రత్యేకమైన ట్రాలీలు..క్రేన్ల ద్వారా హుండీలు కొత్త భవనంలోకి తరలిస్తున్నారు. కొత్త ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో రెండు వందల మంది సిబ్బంది ఒకే సారి కూర్చొని లెక్కించే అవకాశం ఉంది. నిత్యం 200 మంది సిబ్బంది రెండు షిఫ్టుల్లో 14 గంటల పాటు నిరంతరాయంగా హుండీ లెక్కింపు విధుల్లో పాల్గొంటారు. పరకామణి సేవలో.. టీటీడీ ఉద్యోగులతో పాటు.. ఆసక్తి ఉన్న భక్తులకు కూడా టీటీడీ అవకాశం పైన గతంలో చర్చ జరిగింది.

కొత్త భవనం అందుబాటులోకి రావటంతో ఇక్కడే కాయిన్లను కూడా ఇక నుంచి లెక్కించనున్నారు. శ్రీవారి హుండీ లెక్కింపును ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని తిరుమలకు వచ్చిన శ్రీవారి భక్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+