• search
 • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

TTD: బూందీపోటు ప్రారంభించిన సీఎం జగన్, రోజూ 6 లక్షల లడ్డూలు, నిన్న వైఎస్ఆర్, నేడు జగన్ !

|

తిరుమల/ తిరుపతి: తిరుమలలో శ్రీవారి లడ్డూప్రసాదాల తయారీ కోసం శ్రీవారి ఆలయం దక్షిణం వైపున ఇండియా సిమెంట్స్‌ సంస్థ రూ.12 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన బూందీపోటును మంగ‌ళ‌వారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు.

కొత్త బూందీపోటులో రోజుకు 6 లక్షల లడ్డూలు తయారు చెయ్యడానికి అవకాశం ఉంది. 2008లో ఇండియా సిమెంట్స్ ఎండి, టీటీడీ బోర్డు స‌భ్యుడు శ్రీ‌నివాస‌న్ రూ.10 కోట్ల విరాళంతో నిర్మించిన బూందీ పోటును అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్రారంభించారు. ప్ర‌స్తుత టీటీడీ బోర్డు స‌భ్యుడు శ్రీ‌నివాస‌న్ మ‌రోసారి రూ.12 కోట్ల విరాళంతో 8,541 చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన పరికరాలతో నూత‌న బూందీ పోటును నిర్మించారు.

Tirumala: శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్, గరుడ వాహనంపై శ్రీ మలయప్ప కటాక్షం !Tirumala: శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్, గరుడ వాహనంపై శ్రీ మలయప్ప కటాక్షం !

 2008లో రోజుకు 45 వేల లడ్డూలు, ఆలయం వెలుపలకు తరలించిన ప్రభుత్వం

2008లో రోజుకు 45 వేల లడ్డూలు, ఆలయం వెలుపలకు తరలించిన ప్రభుత్వం

శ్రీవారి లడ్డూప్రసాదాల తయారీ కోసం శ్రీవారి ఆలయం దక్షిణం వైపున ఇండియా సిమెంట్స్‌ సంస్థ రూ.12 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన బూందీపోటును మంగ‌ళ‌వారం ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు.

2008వ సంవ‌త్స‌రం వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని బూందీ పోటులో రోజుకు 45 వేల ల‌డ్డూలు త‌యారుచేయ‌డానికి అవ‌స‌ర‌మైన బూందీ త‌యారుచేసేవారు. అప్ప‌టి రాష్ట్ర ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు బూందీపోటును ఆల‌యం వెలుప‌ల‌కు త‌ర‌లించారు.

 ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి

ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి

2008లో ఇండియా సిమెంట్స్ ఎండి, టీటీడీ బోర్డు స‌భ్యుడు శ్రీ శ్రీ‌నివాస‌న్ రూ.10 కోట్ల విరాళంతో నిర్మించిన బూందీ పోటును అప్ప‌టి ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్రారంభించారు. 40 ఎల్‌పిజి స్టౌలు ఏర్పాటుచేసి ల‌డ్డూల త‌యారీ సామ‌ర్థ్యాన్ని రోజుకు 3.75 లక్షలకు పెంచారు. ఎల్‌పిజి స్టౌల కార‌ణంగా వ‌చ్చే వేడి వ‌ల్ల పోటు సిబ్బంది ఇబ్బందులు ప‌డుతుండ‌డాన్ని గుర్తించిన టీటీడీ యాజ‌మాన్యం నూత‌న బూందీ పోటు నిర్మించాల‌ని నిర్ణ‌యించింది.

 తండ్రి బాటలో నేడు సీఎం జగన్... రోజుకు 6 లక్షల లడ్డూలు

తండ్రి బాటలో నేడు సీఎం జగన్... రోజుకు 6 లక్షల లడ్డూలు

ఇండియా సిమెంట్స్ అధినేత, ప్ర‌స్తుత టీటీడీ బోర్డు స‌భ్యుడు శ్రీ శ్రీ‌నివాస‌న్ మ‌రోసారి రూ.12 కోట్ల విరాళంతో 8,541 చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన పరికరాలతో నూత‌న బూందీ పోటును నిర్మించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 40 థర్మిక్‌ ఫ్లూయిడ్‌ స్టౌలు, గాలి వెలుతురు బాగా వచ్చే సదుపాయం క‌ల్పించారు. త‌ద్వారా లడ్డూల తయారీ సామర్థ్యం రోజుకు 6 లక్షలకు పెరిగింది. పోటు సిబ్బంది సౌకర్యవంతంగా బూందీ తయారు చేసేందుకు అవకాశం ఏర్పడింది. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో ఈ రోజు సీఎం జగన్ తిరుమలలో నూతన బూందీపోటును ప్రారంభించారు.

  'Anjanadri' In Tirumala is Hanuman''s Birthplace ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? || Oneindia Telugu
   సీఎం వెంట టీటీటీ చైర్మన్, మంత్రులు

  సీఎం వెంట టీటీటీ చైర్మన్, మంత్రులు

  ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, ఎంపిలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మార్గాని భరత్, గురుమూర్తి,

  టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, శ్రీమతి రోజా, బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆదిమూలం, తిప్పేస్వామి, దాత మరియు బోర్డు సభ్యులు శ్రీ‌నివాస‌న్, ఇతర బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, మధుసూదన్ యాదవ్, శ్రీమతి ప్రశాంతి రెడ్డి, జిల్లా కలెక్టర్ హరినారాయణన్, టీటీడీ సివిఎస్వో గోపినాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

  English summary
  TTD: The Honourable CM of AP Sri YS Jaganmohan Reddy has opened the newly constructed Boondhi Potu on Tuesday. The Boondhi required for preparation of Srivari Prasadam, Laddus, is being prepared in the Boondhi Potu located on Southern side of Srivari Temple, Tirumala.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X