TTD: శ్రీవాణి టికెట్లు, అంగప్రదక్షిణ టోకెన్ల జారీలో కీలక మార్పులు- ఇక నుంచి..!!
Tirumala: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావటంతో ఒక్క సారిగా అనూహ్యం గా రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తులతో నిండిపోయింది. శిలాతోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 30వ తేదీ నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో శ్రీవాణి టికెట్లు.. అంగప్రదక్షిణ టోకెన్ల విషయంలో టీటీడీ కీలక మార్పులకు సిద్దమైంది.
ఇప్పటి వరకు తిరుమలలో ఆఫ్‌లైన్ విధానంలో జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను త్వరలో ఆన్‌లైన్‌లోకి మార్చేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సిఫార్సు లేఖలకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో భక్తులు రూ.10,500 శ్రీవాణి దర్శన టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. 3 నెలల ముందుగా ఆన్‌లైన్‌లో రోజుకు 500 టికెట్ల చొప్పున అందుబాటు లో ఉంచుతుండగా క్షణాల్లో బుక్ చేసుకుంటున్నారు. మరోవైపు ఆఫ్‌లైన్‌లో ఏరోజుకారోజు తిరుమలలో 800, అలాగే మరో 200 టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో జారీ చేస్తున్నారు. శ్రీవాణి దర్శన టికెట్ల కోసం నేరుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. అన్నమయ్య భవనం ఎదుట ఉన్న ఆఫ్‌లైన్ జారీ కేంద్రం వద్ద ఉదయం 6 గంటలకు టికెట్లు ఇస్తుండగా భక్తులు ముందురోజు రాత్రి 7 గంటల నుంచే వేచి ఉంటున్నారు.

ఈ కోటా పరిమితంగా ఉండటంతో టికెట్లు రాని భక్తులు ఆందోళనకు దిగడం పరిపాటిగా మారింది. ఎయిర్‌పోర్ట్‌లోను కూడా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు టీటీడీ అధికారులు గుర్తించారు.దీంతో, సమస్య పరిష్కారం కోసం టీటీడీ ఓ అధ్యయన కమిటీని నియమించారు. వారి వద్ద నుంచి నివేదిక తీసుకున్నారు. ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టికెట్ల జారీతో ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉందని కమిటీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. భక్తుడు తిరుమలలో ఉన్నట్లు జీపీఎస్ ద్వారా నిర్థారిస్తారు. ఆ తర్వాతే శ్రీవాణి టికెట్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు అనుమతి లభిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు వీలు పడదు. దీంతో భక్తులు క్యూలైన్‌లో వేచి ఉండకుండానే టికెట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకోవచ్చు.
ఈ విధానం అమలులో సమస్యలు లేకుండా పూర్తి స్థాయి సన్నద్దతతో జనవరి నుంచి అమలు చేయాలని టీటీడీ ఉన్నత అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. తిరుమల అంగప్రదక్షణ టోకెన్ల జారీ విధానంలోనూ టీటీడీ మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతంలక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అనే పద్ధతిలో టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం 3 నెలలకు ముందే ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల కానుండగా.. భక్తులు ముందుగానే బుక్‌చేసుకో వాల్సి ఉంటుంది. టీటీడీ తాజా మార్పులను భక్తులు గమనించాలని అధికారులు కోరుతున్నారు.
-
అరుణాచలం వెళ్తున్నారా, కీలక సమాచారం..!! -
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications