TTD: శ్రీవారి సేవకులుగా వీరికి అవకాశం, సంస్కరణలు- కొత్త బాధ్యతలు..!!
Tirumala: తిరుమలలో శ్రీవారి సేవ చేయాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కొంత మందికే అవకాశం దక్కుతుంది. శ్రీవారి సేవ కోసం ముందుకొస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంతో పాటుగా కొత్త సంస్కరణలను ప్రవేశ పెట్టేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇతర ఆధ్యాత్మిక కేంద్రాల్లో సేవకుల విధానం పైన అధ్యయనం చేస్తున్నారు. తిరుమలలోనూ కొత్త విధానం అమల్లోకి తెస్తున్నారు. మరిన్ని బాధ్యతలను కేటాయిం పుకు నిర్ణయం తీసుకున్నారు. సేవకుల కోటా పైనా స్పష్టత ఇచ్చారు.
సేవలు - మార్పులు
తిరుమలలో శ్రీవారి స్వచ్ఛంద సేవలు పలు మార్పులు చేర్పులతో అందుబాటులోకి రానున్నా యి. టీటీడీ అధికారులు ఇప్పటికే ఇషా ఫౌండేషన్ (కోయంబత్తూర్), శ్రీసత్యసాయి సేవా సంస్థ (పుట్టపర్తి), ఆర్ట్ ఆఫ్ లివింగ్ (బెంగళూరు) వంటి సంస్థలను సందర్శించి, వాటిపై అధ్యయనం చేశారు. శ్రీవారి సేవ(తిరుమల మరియు తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ లీడర్స్ (సీనియర్ సేవక్స్) సేవల జూలై నెల కోటాను మే 29న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తా రు. కాగా, పదవీ విరమణ పొందిన గవర్నమెంట్ ఉద్యోగులు రెండేళ్లుగా సేవలో పాల్గొంటున్నారు. 45 నుంచి 70 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు ఇందులో పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది. ఇకపై వీరిని గ్రూప్ లీడర్స్‌గా పిలవనున్నారు.

వీరికి అవకాశం
వీరు 15 రోజులు, నెల లేదా మూడు నెలల వ్యవధితో సేవ చేయడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు శ్రీవారి సేవకుల హాజరును నమోదు చేయడం, పనిని నిరంతరం పర్యవేక్షిం చడం, వ్యక్తిగత పనితీరును ముల్యాంకనం చేయడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తారు. పరకామణి సేవలో కనీస విద్యార్హత పదో తరగతి చదివిన పురుషులకు మాత్రమే అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయిం చింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా పరకామణి సేవను నమోదు చేసుకోవచ్చు. అయితే, ఆఫ్ లైన్ లోనూ శ్రీవారి సేవా కోటా అందుబాటులోకి తేవాలనే అభ్యర్ధనలు వస్తున్నాయి. కాగా, ఆఫ్ లైన్ లో ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో ఆన్ లైన్ లో ఇస్తున్నామని.. సంస్కరణలు తెస్తున్నామని ఈవో చెబుతున్నారు.
కొత్త బాధ్యతలు
శ్రీవారి సేవకులకు కొత్త బాధ్యతలను కేటాయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వివిధ కేటగిరీల్లో కొనసాగుతున్న వాటితో పాటుగా గోమాతలకు సేవ చేసేందుకు 'గోసేవ'ను అందుబాటు లోకి తీసుకురానున్నారు. అదే విధంగా గ్రూప్ లీడర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి వారికి దశలవారీగా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక.. తిరుమలలో తిరునామధారణ కార్యక్రమాన్ని పునరుద్ధరించారు. శ్రీవారి సేవకులతో తిరుమలలోని 18 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతోందని అధికారులు వివరించారు.












Click it and Unblock the Notifications