తిరుమల క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లల్లో ఇకపై..!!
Tirumala: ఢిల్లీలోని చారిత్రాత్మక రెడ్ ఫోర్ట్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ పేలుడులో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారికి ఢిల్లీ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తోన్నారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉంటోంది. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ కారులో ఈ పేలుడు సంభవించింది.
ఈ పరిస్థితుల మధ్య వేలాదిమంది సందర్శించే తిరుమల భద్రతపై దేవస్థానం అధికారులు సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ.. తిరుమల భద్రతపై ఆరా తీశారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మరింత అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడారు. దర్శన క్యూలైన్ల నిర్వహణను మరింత పటిష్టం చేయడానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, లోపల, బయట క్యూలైన్లలోని సీసీటీవీ కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను మరింత బలోపేతం చేయాలని సూచించారు. విజిలెన్స్, వైకుంఠం, ఆలయ సిబ్బంది క్యూలైన్ లో భక్తుల సంఖ్య, కదలికలపై గణాంకాలను ఎప్పటికప్పుడు విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.
ఇందుకు ఐటీ విభాగానికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించాలని వెంకయ్య చౌదరి ఆదేశించారు. అమెరికాకు చెందిన కార్య ఫౌండేషన్ ఇప్పుడున్న సాప్ట్ వేర్ ను రివ్యూ చేసి మరింత అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందులో భాగంగా ఆ సంస్థకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వైకుంఠం, విజిలెన్స్ సిబ్బంది అందించాలని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై ప్రతివారం సమీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఢిల్లీ పేలుడు అనంతరం తిరుమలలో హైఅటర్ట్ ప్రకటించారు. తిరుమలకు వస్తున్న కారు, బస్సు ఇతర వాహనాలను పోలీసులు ఆపి, పూర్తిగా తనిఖీలు చేశారు. భక్తుల లగేజీలను సోదా చేశారు. అలిపిరి టోల్ గేట్ వద్ద దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనపు సిబ్బందిని మోహరింపజేశారు. ఘాట్ రోడ్లు, తిరుమలలోని పార్కింగ్ ప్రదేశాలు, ఎంట్రీ పాయింట్ వద్ద కూడా తనిఖీలు కొనసాగాయి.
-
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications