నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాగులో బస్సు బోల్తా: 30మందికి విద్యార్థులకు గాయాలు: 2బస్సులు ఢీ, 10మందికి గాయాలు

ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి మండలం అలవలపాడు వద్ద పాలేరు వంతెనపై గురువారం తెల్లవారుజామున మరో ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లి వస్తున్న ఓ ప్రైవేటు బస్సు కల్వర్టును ఢీకొని అదుపుతప్పి వాగులో పడ

|
Google Oneindia TeluguNews

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌లో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదాన్ని మర్చిపోకముందే ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి మండలం అలవలపాడు వద్ద పాలేరు వంతెనపై గురువారం తెల్లవారుజామున మరో ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లి వస్తున్న ఓ ప్రైవేటు బస్సు కల్వర్టును ఢీకొని అదుపుతప్పి వాగులో పడింది.

ఈ ఘటనలో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే కనిగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించారు.

కల్వర్టులో పడిపోయిన దివాకర్ ట్రావెల్స్ బస్సు: 11మంది మృతి, 20మందికి గాయాలు కల్వర్టులో పడిపోయిన దివాకర్ ట్రావెల్స్ బస్సు: 11మంది మృతి, 20మందికి గాయాలు

ప్రమాద సమయంలో బస్సులో 70 మంది విద్యార్థులు ఉన్నారు. ఉలవపాడు మండలం కరేడు ఉన్నత పాఠశాలకు చెందిన వీరంతా మహానంది, యాగంటికి విహారయాత్రకు వెళ్లివస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కనిగిరి ఎమ్మెల్యే బాబురావు అధికారులను ఆదేశించారు.

accident

ప్రైవేటు బస్సును ఢీకొన్న వోల్వో బస్సు: 10మందికి గాయాలు

నెల్లూరు: జిల్లాలోని దొరవారి సత్రం మండలం నెలబల్లి సమీపంలో జాతీయరహదారిపై గురువారం తెల్లవారుజామున ప్రైవేటు కంపెనీ బస్సును వోల్వో బస్సు ఢీకొంది.
స్థానికుల కథనం ప్రకారం.. శ్రీసిటీలోని సెల్‌ఫోన్‌ కంపెనీకి మహిళా ఉద్యోగులతో వెళ్తున్న బస్సును విజయవాడ నుంచి నెల్లూరుకు వెళ్తున్న వెంకటేశ్వర ట్రావెల్స్‌ వోల్వో బస్సు వెనుక నుంచి ఢీకొంది.

దీంతో ఉద్యోగినులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 8మంది మహిళలు, ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. క్షతగ్రాత్రులను 108లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

English summary
Two bus accidents occurred in Prakasam and Nellore districts, in this incidents 30 persons injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X