భారీవర్షాలకు గోడకూలి ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు; విజయనగరం జిల్లాలో విషాదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. రుతుపవనాల గమనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి , అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలలో పలు చోట్ల రాకపోకలు స్తంభించాయి. విజయనగరం జిల్లాలో వర్షం కారణంగా విషాదం చోటు చేసుకుంది.

విజయనగరం జిల్లాలో వర్షం కారణంగా కూలిన గోడ.. ఇద్దరు మృతి

విజయనగరం జిల్లాలో వర్షం కారణంగా కూలిన గోడ.. ఇద్దరు మృతి

విజయనగరం జిల్లాలోని గరివిడి మండలం కుమరాం గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అర్ధరాత్రి గోడ కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతులను 45 సంవత్సరాల అడ్డాల లక్ష్మీ, ఐదు సంవత్సరాల ఆమె మనవడు హర్షిత్ వర్మ గా గుర్తించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటిన విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వర్షం కారణంగా గోడకూలి ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.

నిన్న నల్గొండ జిల్లాలోనూ ఇదే తరహా ఘటన

నిన్న నల్గొండ జిల్లాలోనూ ఇదే తరహా ఘటన

ఇక నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్రంలోనూ నల్గొండ జిల్లాలో వర్షం కారణంగా గోడకూలి తల్లి, కూతురు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. నల్గొండ లోనూ భారీగా కురిసిన వర్షానికి రాత్రి సమయంలో నిద్ర పోతూ ఉండగా వర్షం కారణంగా గోడ కూలి వారిపై పడడంతో నిద్రలోనే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ విజయనగరం జిల్లాలో వర్షం ఒక కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.

మృతదేహాలు పోస్ట్ మార్టం కు తరలింపు

మృతదేహాలు పోస్ట్ మార్టం కు తరలింపు

విజయనగరం జిల్లాలో వర్షం కారణంగా చోటు చేసుకున్న ఊహించని ఈ పరిణామానికి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఇక ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

శిధిలావస్థకు చేరిన ఇళ్ళు సురక్షితం కాదని , అలెర్ట్ అంటున్న అధికారులు

శిధిలావస్థకు చేరిన ఇళ్ళు సురక్షితం కాదని , అలెర్ట్ అంటున్న అధికారులు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వాతావరణ శాఖ అధికారులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చేసిన సూచనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శిథిలావస్థకు చేరుకున్న భవనాలలో నివసించడం మంచిది కాదని పదేపదే హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+