ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు- మొత్తం పదికి చేరిన బాధితులు..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుందని భావిస్తున్న తరుణంలో మళ్లీ రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాషింగ్టన్ డీసీతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పదికి చేరింది. అయితే వీరిలో నెల్లూరుకు చెందిన విద్యార్ది కోలుకోవడంతో ఇంటికి పంపి క్వారంటైన్ లలో ఉంచారు.

ఏపీలో మరో రెండు కరోనా కేసులు..
ఏపీలో ఇవాళ మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాషింగ్టన్ డీసీ నుంచి ఈ నెల 20వ తేదీన ఢిల్లీకి వచ్చిన విజయవాడ విద్యార్ధితో పాటు గుంటూరు నుంచి ఢిల్లీకి మతపరమైన ప్రార్ధనల కోసం వెళ్లిన మరో వ్యక్తికి కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలడంతో పరీక్షించి పాజిటివ్ గా తేల్చారు. దీంతో వీరిద్దరూ విజయవాడ ఫీవర్ ఆస్పత్రిలో క్వారంటైన్ వార్డులో ఉన్నారు.

వాషింగ్టన్ టూ విజయవాడ..
వాషింగ్డన్ డీసీలో ఎంఎస్ చదువుతున్న విజయవాడ విద్యార్ధి.... ఈ నెల 20న ఢిల్లీ వచ్చాడు. అక్కడ ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షల తర్వాత 21న డిశ్చార్జ్ అయ్యాడు. 22న విజయవాడ చేరుకున్న సదరు విద్యార్ధి స్నేహితుడి కారులో ఇంటికెళ్లిపోయాడు. కానీ కరోనా లక్షణాలు మళ్లీ కనిపించడంతో 23న విజయవాడ జీజీహెచ్ లో చేరాడు. పరీక్షించిన డాక్టర్లు శాంపిల్స్ పరీక్షకు పంపగా.. ఇవాళ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

గుంటూరు వాసికీ కరోనా పాజిటివ్ ....
మరోవైపు ఈ నెల 14వ తేదీన ఢిల్లీకి మతపరమైన ప్రార్ధనల కోసం వెళ్లిన 55 ఏళ్ల గుంటూరు వాసి తిరిగి 16వ తేదీన దురంతో ఎక్స్ ప్రెస్ లో విజయవాడ చేరుకుని అక్కడి నుంచి 19వ తేదీన గుంటూరు వెళ్లిపోయాడు. కానీ ఆ తర్వాత కరోనా లక్షణాలు కనిపించడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత 23వ తేదీన ఆయన్ను ఫీవర్ ఆస్పత్రికి మార్చారు. ఈ శాంపిల్ కూడా పరీక్షలకు పంపగా.. ఇవాళ పాజిటివ్ గా తేలింది. దీంతో క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Recommended Video

పదికి చేరిన కేసులు- ఒకరు డిశ్చార్జ్...
ఇవాళ నమోదైన రెండు కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ గా తేలిన వారి సంఖ్య 10కి చేరింది. అయితే వీరిలో నెల్లూరుకు చెందిన విద్యార్ధి కోలుకోవడంతో ఇంటికి పంపి హోం క్వారంటైన్ అందిస్తున్నారు. మిగిలిన వారిలో ఒంగోలు, విజయవాడ, కాకినాడ, చిత్తూరులో ఒక్కొక్కరు చొప్పున, విశాఖలో మరో ముగ్గురు పాజిటివ్ లక్షణాలతో క్వారంటైన్ లో ఉన్నారు.
-
ఆ రెండు జిల్లాల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం..!! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
అమరావతి ఖర్చు అసలు లెక్క ఇదీ..!! -
AP KGBV Admissions: కేజీబీవీల్లో అడ్మిషన్ల గడువు పెంపు-పూర్తి వివరాలివే..! -
కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్, మన రాష్ట్రాల్లో ఖాళీలివే! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications