మహిళను రేప్ చేసిన ఇద్దరు: భార్యపై అనుమానంతో కొడుక్కి వాతలు
విజయవాడ: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ పొలాల్లో ఓ మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారయత్నం చేశారు. పొలాల్లో ఉన్న మహిళ అరవడంతో ఒక యువకుడు పరారయ్యాడు. మరో యువకుడిని రైతులు పట్టుకొని దేహశుద్ధి చేశారు.
ఇదిలావుంటే, కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండలం లింగందిన్నెలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఏడాది బాలుడికి తండ్రి వాతలు పెట్టాడు. గ్రామానికి చెందిన పెద్దకాశిం, వీరేశ్వరికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడాది బాలుడు ఉన్నాడు.
అయితే కొడుకు తనకు పుట్టలేదంటూ భార్యపై అనుమానంతో పెద్దకాశిం అత్యంత కిరాతకంగా కుమారుడి చేతులు కాల్చాడు. అక్కడకు చేరుకున్న భార్య ఈ విషయాన్ని బంధువులకు తెలియజేసింది.

వెంటనే బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. తనపై అనుమానంతోనే భర్త ఈ ఘోరానికి పాల్పడ్డాడని వీరేశ్వరి తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
యువకుడి ఆత్మహత్య
విజయనగరం జిల్లా బోగాపురం మండలం గూడెపువలసలో చెరువులో దూకి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎయిర్‌పోర్టు కోసం భూములు తీసుకుంటారన్న ఆందోళనతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications