హృదయ విదారకం: బతికుండగానే తల్లి ఖననానికి యత్నం

అనంతపురం/రాజమండ్రి: కన్నతల్లి బతికి ఉండగానే సజీవ దహనం చేసేందుకు ఓ కొడుకు యత్నించాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని కొత్త చెరువులో ఆదివారం నాడు చోటు చేసుకుంది. నాగరాజు అనే వ్యక్తి ప్రాణంతో ఉన్న తన 80 ఏళ్ల తల్లిని బతికి ఉండగానే చాపపై పడుకోబెట్టి స్మశానానికి తీసుకు వెళ్లాడు.

అది మీడియా కంటపడింది. ఆరా తీయగా కంటతడి పెట్టుకున్నాడు. తాను ఆమెను చూసుకోలేక ఇలా చేస్తున్నానని చెప్పాడు. సమాచారం అందించడంతో అధికారులు వచ్చారు. ఆ తల్లిని వైద్యులు పరీక్షించారు. చికిత్స అందించారు.

Two son killed with current shock

నాగరాజు వయస్సు 50 ఏళ్లు. అతను కొన్నేళ్లుగా నరాల బలహీనత కారణంగా పని చేయలేకపోతున్నాడు. పెళ్లి కాలేదు. తన తల్లిని పోషించలేక ఆమెను బతికి ఉండగానే ఖననం చేసేందుకు తీసుకు వెళ్లగా కంటపడ్డాడు. ఇల్లు లేదని, రోడ్డు పక్కన బతుకుదెరువు వెళ్లదీస్తున్నాడు.

తండ్రి పాడె మోసుకెళ్తూ కుమారుల దుర్మరణం

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ తండ్రి పాడె మోసుకు పోతుండగా ఇద్దరు కుమారులు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. రామచంద్రాపురం మండలం వెల్ల సావరం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు మృతి చెందారు. ఆదివారం ఆయన శవాన్ని తీసుకు వెళ్తుండగా ఇద్దరు కుమారులు ముందు భాగంలో మోస్తున్నారు. వారికి మార్గమధ్యంలో విద్యుత్ తీగలు తాగి మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+