మరో వివాదంలో ఇద్దరు టీడీపీ మాజీ మంత్రులు, ఓ ఎమ్మెల్యే- కోడలి ఫిర్యాదు- అట్రాసిటీ కేసు...

ఏపీలో టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఓవైపు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణంలో రిమాండ్ కు వెళ్లగా.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఇదే కోవలో మరో ఇద్దరు మంత్రులపై ఓ సీరియస్ ఫిర్యాదు అందింది. ఇందులో టీడీపీకే చెందిన మరో మాజీ ఎమ్మెల్యే, ఆమె భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రుల పాత్ర ఉందని తేలితే వారికీ కష్టాలు తప్పకపోవచ్చు.

 పెళ్లి వివాదంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యే...

పెళ్లి వివాదంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యే...

టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన రోజే మరో ఇద్దరు టీడీపీ మాజీ మంత్రుల మీద ఓ ఫిర్యాదు వచ్చింది.అయితే, అది ఈఎస్ఐ స్కాంకి సంబంధించింది కాదు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేతలు, చంద్రబాబు హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన చినరాజప్ప, ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు మీద ఫిర్యాదు చేసింది. ఓ దళిత యువతి వారిద్దరిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తన భర్తకు రెండో వివాహం చేయించేందుకు యనమల, చినరాజప్ప ప్రయత్నించారని ఆరోపించింది.

 మాజీ ఎమ్మెల్యే కుమారుడి పెళ్లిలో....

మాజీ ఎమ్మెల్యే కుమారుడి పెళ్లిలో....

కాకినాడ రూరల్ మాజీ టీడీపీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ కుమారుడు రాధకృష్ణ... తొమ్మిదేళ్ళ క్రిందట మంజుప్రియ అనే దళిత యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. గత కొంత కాలంగా భర్తని కాపురానికి పంపకుండా వేధించడంతో మార్చి 10న కాకినాడలోని ఇంద్రపాలెం పోలీసు స్టేషన్లో అత్తమామలపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణ నిర్వహించిన పోలీసులు ఈ వ్యవహారంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

 మాజీ ఎమ్మెల్యే కుమారుడి పెళ్లిలో....

మాజీ ఎమ్మెల్యే కుమారుడి పెళ్లిలో....

కాకినాడ రూరల్ మాజీ టీడీపీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ కుమారుడు రాధకృష్ణ... తొమ్మిదేళ్ళ క్రిందట మంజుప్రియ అనే దళిత యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. గత కొంత కాలంగా భర్తని కాపురానికి పంపకుండా వేధించడంతో మార్చి 10న కాకినాడలోని ఇంద్రపాలెం పోలీసు స్టేషన్లో అత్తమామలపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణ నిర్వహించిన పోలీసులు ఈ వ్యవహారంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Recommended Video

    అవినీతి చేసిన ఎవ్వరినీ వదలము.. RK ROJA వార్నింగ్
     చిక్కుల్లో ప్రజాప్రతినిధులు...

    చిక్కుల్లో ప్రజాప్రతినిధులు...

    ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కుమారుడికి రెండో పెళ్లికి సహకరించిన వ్యవహారంలో ఇద్దరు మాజీ మంత్రుల పాత్ర ఉన్నట్లు తేలితే పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకే రోజు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు కీలక నేతలపై ఫిర్యాదులు రావడంతో కలకలం రేగుతోంది. మరోవైపు త్వరలో ఈ కేసులో మాజీ మంత్రి యనమల అరెస్టు తప్పదంటూ జిల్లాలోని రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసినట్లు చెబతున్న వ్యాఖ్యలు నిజమైతే వీరికి చిక్కులు తప్పకపోవచ్చని తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+