సెల్ ఫోన్ యూజర్లు ఎక్కడ ఉంటే అక్కడే ఆఫీస్

WatsApp Governence: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పరిపాలనలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. వాట్సప్ గవర్నెన్స్‌‌ను ప్రవేశపెట్టింది. దీన్ని విజయవంతంగా అమలు చేస్తోంది.

వివిధ రకాల సేవలు, సర్టిఫికెట్ల కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన శ్రమ ఇక తప్పినట్టయింది. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పాలనాపరమైన సంస్కరణలకు చంద్రబాబు- పవన్ కల్యాణ్ సర్కార్ తెర తీసింది. ఈ క్రమంలో జనవరి 18వ తేదీన వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రారంభించింది.

Ugadi 2025 All Government services will be provided through WhatsApp says Chandrababu

దీన్ని మరింత విస్తరించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం వాట్సప్ ద్వారా 161 రకాల సేవలు అందుబాటులో ఉంటోన్నాయి. వీటిని 500లకు పెంచాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేయాలంటూ గతంలోనే చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

వచ్చే 100 రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, వాయిస్-అనేబుల్డ్ సేవలను ప్రారంభించడానికి అటు నారా లోకేష్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఐటీ మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది కూడా. తదుపరి అసెంబ్లీ సమావేశాల నాటికి దీనికి అవసరమైన సవరణలను చేయాలని భావిస్తోంది. ప్ర్రభుత్వ సేవలన్నింటినీ కూడా మరింత సులభంగా ప్రజలకు అందే ఏర్పాట్లు చేయనుంది.

ఇదే విషయాన్ని చంద్రబాబు తాజాగా పునరుద్ఘాటించారు. ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఆయన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో కలిసి పాల్గొన్నారు. పంచాంగ శ్రవణాన్ని ఆలకించారు. ఉగాది పచ్చడిని స్వీకరించారు.

అనంతరం ఆయన మాట్లాడారు. సెల్ ఫోన్ ఓ వ్యసనంలా మారితే అనేక సమస్యలు వస్తాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. అదే సెల్‌ ఫోన్‌ను ఆయుధంగా మలచుకుంటే అందరి జీవితాల్లో వెలుగు వస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జీవితాల్లో అనేక మార్పులు వస్తాయని చెప్పారు.

Ugadi 2025 All Government services will be provided through WhatsApp says Chandrababu

సెల్ ఫోన్ వినియోగదారులు ఎక్కడ ఉంటే అక్కడే ఆఫీస్.. అనే విధంగా తమ పరిపాలన ఉండబోతోందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏ ఆఫీస్‌కు వెళ్లాల్సిన పని ఉండదని చెప్పారు. సెల్ ఫోన్ ద్వారా క్యాబ్‌, ఆటోలను బుక్ చేసుకోవచ్చని గుర్తు చేశారు. ఎక్కడో బయట ఉండి ఇంట్లో ఏసీ వేసుకోవాలనుకున్నా సెల్ ఫోన్ ద్వారా సాధ్యపడుతుందని పేర్కొన్నారు.

సెల్ ఫోన్‌లోనే ఆదేశాలను జారీ చేసే పరిస్థితి వస్తుందని చంద్రబాబు అన్నారు. వర్చువల్ ఫిజికల్ వర్క్ చేసే పరిస్థితికి తామందరం వచ్చేశామని, అధికార వికేంద్రీకరణలో భాగంగా గతంలో ఎన్టీ రామారావు మండలాలను తీసుకొచ్చారని, తన హయాంలో ప్రజల వద్దకు పాలన ప్రవేశపెట్టానని అన్నారు.

ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా వినియోగదారుల చేతల్లోనే ప్రభుత్వ పరిపాలన ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సెల్ ఫోన్ లోనే ఏం కావాలంటే అది అందిస్తామని, సర్టిఫికెట్ల కోసం ఎవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదని అన్నారు. ఏ సర్టిఫికెట్ కావాలో సెల్ ఫోన్ ద్వారా అడిగితే వాటిని వాట్సప్ ద్వారా అందిస్తామని స్పష్టం చేశారు.

Take a Poll

ఆర్థిక అసమానతలు రూపుమాపే క్రమంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోన్నామని చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలోనే పీ4ను ప్రారంభించబోతోన్నామని చెప్పారు. మార్గదర్శి-బంగారు కుటుంబం- పీ4- జీరో పవర్ అనే కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకుని రానున్నామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+