తిరుమలలో అరుదైన ఘట్టం- బంగారు వాకిలి వద్ద

Ugadi 2025: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 65,569 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 21,780 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.15 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో తొమ్మిది కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

Ugadi 2025 TTD to celebrate Sri Vishwavasu Nama Ugadi in Tirumala today

కాగా- నేడు విశ్వావసు నామ ఉగాది. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఆలయాల్లో రద్దీ నెలకొంది. ఛైత్ర నవరాత్రి కావడం వల్ల అటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ దేవస్థానాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జామునుంచే భక్తులు బారులు తీరి నిల్చున్నారు.

ఉగాది పండగను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష పూజలు, కార్యక్రమాలను నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉగాది ఆస్థానం, ఉగాది కవి సమ్మేళనం, నాద నీరాజనం, కవుల ఇష్టాగోష్టి.. వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో తిరుమల కొత్త శోభను సంతరించుకోనుంది.

శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనం వేదికపై కవి సమ్మేళనం కార్యక్రమం జరగనుంది. శ్రీవారు కొలువుదీరిన ఏడు కొండలు కావడం వల్ల ఏడుగురు కవులు ఈ నాద నీరజనంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత ఇది ఆరంభమౌతుంది. మన సంస్కృతి, సాంప్రదాయాలు, టీటీడీ భక్తులకు చేస్తోన్న సేవలపై కవులు పద్యాల రూపంలో వివరిస్తారు.

అనంతరం శ్రీవారి ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా జ‌రుగ‌నుంది. ఉదయం 7 నుండి 9 గంటల మధ్య ఈ ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+