వైఎస్‌కు మిత్రుడు: జగన్ పార్టీలోకి ఉండవల్లి అరుణ్ కుమార్?

Posted By:
Subscribe to Oneindia Telugu

రాజమండ్రి : మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్ మంగళవారంనాడు ఉండవల్లి అరుణ్ కుమార్‌ను పరామర్శించారు. మంగళవారం సాయంత్రం జగన్ రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఆయనకు విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం చెప్పారు. విమానాశ్రయం నుంచి జగన్ నేరుగా ఉండవల్లి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్సించారు. కొద్ది రోజుల క్రితం ఉండవల్లి అరుణ్ కుమార్ తల్లి మరణించింది. ఆ తర్వాత జజగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల మరణించిన తమ పార్టీ నేత బూరుగుపల్లి చిన్నారావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

Unadavalli Arun Kumar may join in YSR Congress

పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారంనాడు జగన్ విస్తృతంగా పర్యటిస్తారు. బుధవారం ఉదయం జంగారెడ్డిగూడెలో పొగాకు రైతులతో ఆయన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కుక్కునూరులో పోలవరం నిర్వాసితులకు సంఘీభావం ప్రకటిస్తారు.

ఇదిలావుంటే, ఉండవల్లి అనుచరుడిగా ఉంటున్న సూర్యప్రకాశరావుకు రెండు రోజుల క్రితమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్‌ పదవి వచ్చింది. ఈ నేపథ్యంలో జగన్, ఉండవల్లిని కలుసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉండవల్లి అరుణ్ కుమార్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతోనే ఆయన ఈనాడు అధినేత రామోజీరావుపై సమరం ప్రకటించారని అంటారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించి కాంగ్రెసు నుంచి బయటకు వచ్చిన ఉండవల్లి ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్తాపించిన జై సమైక్యాంధ్ర పార్టీకి పనిచేశారు. అయితే, అది ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that ex MP Undavalli Arun Kumar may join in YS Jagan's YSR Congress party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి