బీజేపీతో పొత్తు కోసం బలి చేస్తున్నారు, పిలిచి అడుగు: బాబుపై ఉండవల్లి

పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం నిప్పులు చెరిగారు.

అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం నిప్పులు చెరిగారు.

స్వలాభం కోసం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచుకుంటూ కాంట్రాక్టర్లకు వరం ఇస్తోందన్నారు.

Undvalli says polavaram Project will not complete before 2018

పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉందని తెలిపారు. కేంద్రం నిర్మించాలని చట్టంలో ఉంటే చంద్రబాబు దానిని ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ప్రస్తుత నిర్మాణ పనులు, నిధులు, ఇతర విషయాలు పరిశీలిస్తుంటే 2018లోపు పోలవరం పూర్తి కావడం అసాధ్యంగా కనిపిస్తోందన్నారు.

ట్రాన్స్‌ట్రాయ్‌ని తప్పించాలంటే పిలిచి మాట్లాడాలన్నారు. నోటీసులు ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తేల్చి చెప్పారు. బీజేపీతో పొత్తు కోసమే పోలవరం ప్రాజెక్టును బలి చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+