జీఎస్టీ సంస్కరణలతో వీరికి రిలీఫ్, తగ్గే ధరలు ఇవే - నిర్మలా ప్రకటన..!!

నవరాత్రులు ప్రారంభం నుంచే కొత్త జీఎస్టీ విధానం పనిచేస్తుందని కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. విశాఖ వీ కన్వెన్షన్‌లో నిర్వహించిన నెక్స్ట్ జెన్ జీఎస్టీ 2.0 అవుట్ రీచ్ ప్రోగ్రామ్‌లో కేంద్రమంత్రి పాల్గొన్నారు. జీఎస్టీ 2.0 అమలులోకి రాక ముందే ఆటో మొబైల్ ఇండస్ట్రీ ఆఫర్లు ప్రకటించడం కనిపిస్తోందన్నారు. పాలు, పెరుగు సహా పలు నిత్యావసరాలను 5 శాతం శ్లాబ్‌ నుంచి సున్నా శాతానికి తీసుకొచ్చాం. మధ్యతరగతికి ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకున్నామని నిర్మలా వివరించారు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ సంస్కరణల గురించి వివరించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.7.19 లక్షల కోట్ల ఆదాయం రాగా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.22.08 లక్షల కోట్ల ఆదాయం లభించిందని చెప్పారు. ప్రజల పై భారం తగ్గించేందుకే జీఎస్టీ తీసుకొచ్చామన్నారు. కారు, ఫ్రిజ్‌, ఏసీని 28 శాతం నుంచి 18 శాతానికి తీసుకొచ్చామని సీతారామన్‌ తెలిపారు. మహిళల ఆరోగ్యం కోసం శానిటరీ న్యాప్‌కిన్స్‌పై పన్నును సున్నా చేశాం.

Union Minister Nirmala Sitaraman explains Govt vision over GST2 0

యూపీఏ ప్రభుత్వంలో 30 శాతం ఉన్న వస్తువులను ఇప్పుడు 5 శాతానికి తెచ్చాం. సరళతరమైన పన్ను విధానాన్ని తీసుకురాలేని వాళ్లు ఇప్పుడు విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. గతంలో 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండేవాళ్లు. ఈ 8 ఏళ్లలో ఆ సంఖ్య 1.51 కోట్లకు చేరిందని నిర్మలా సీతారామన్‌ వివరించారు.

వెన్న, నెయ్యి, వంటపాత్రలను 12 నుంచి 5 శాతానికి తెచ్చాం. పప్పులు, చింతపండు, ఉప్పును 12 నుంచి 5 శాతానికి ..హెయిర్‌ ఆయిల్‌, షాంపూను 18 నుంచి 5 శాతానికి తీసుకొచ్చామని,, మధ్యతరగతికి ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.కారు, ఫ్రిజ్ ఏసీని 28 నుంచి 18 శాతానికి తీసుకొచ్చామన్నారు. జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్‌కు పెద్ద ఊతం. ఐదు విభాగాలు చేసి ఏ స్లాబ్‌లో ఏ వస్తువులు ఉండాలో నిర్ణయించామని వెల్లడించారు.

Union Minister Nirmala Sitaraman explains Govt vision over GST2 0

అనేక రంగాల్లో జీఎస్టీ ప్రయోజనాలు చేకూరాయని.. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేశామన్నారు. పురుగు మందులు, డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలను దృష్టిలో పెట్టుకున్నామన్నారు. ఎంఎస్‌ఎంఈల దిగుమతులు, ఎగుమతులపై ఆలోచించామని నిర్మలా సీతారామన్‌ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+