జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు బాబు మంత్రి పదవులు: వెంకయ్య సంచలనం
పార్టీ మారిన వ్యక్తులు ఆ పార్టీతో వచ్చిన పదవులకు రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు.ఈ మేరకు చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారాయన.
హైదరాబాద్: పార్టీ మారిన వ్యక్తులు ఆ పార్టీతో వచ్చిన పదవులకు రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు.ఈ మేరకు చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారాయన.
పార్టీ ఫిరాయింపులపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.వైఎస్ఆర్ సిపి నుండి టిడిపిలో చేరిన నలుగురికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చోటు కల్పించడం పట్ల వైసీపి తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది.అదే సమయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది.
ఈ విషయమైన వైసీపి అధినేత జగన్ గవర్నర్ ను కలిసి వినతి పత్రం కూడ సమర్పించారు. ఈ సమయంలోనే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ రకమైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ మేరకు అన్ని పార్టీలు తమతో కలిసి రావాలని ఆయన సూచించారు. 2019 ఎన్నికల్లో తాము తెలంగాణలో ఒంటరిగా పోటీచేస్తామని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమన్నారు.మత ఛాందసవాద శక్తులతో చేతులు కలపబోమని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కమ్యూనిష్టులు ఒక్క సీటును కూడ గెల్చుకోలేకపోయారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ సింగిల్ మెన్ ఎంటర్ ప్రైజెస్ గా మారిందన్నారు. బీసీల కమిషన్ కు రాజ్యాంగభద్రత కల్పిస్తూ మోడీ నిర్ణయం తీసుకొన్నారని, ఈ మేరకు త్వరలోనే పార్లమెంట్ లో బిల్లు పెడతామని ప్రకటించారు.
బీఎస్పీ, ఎంఐఎం, సమాజ్ వాదీ పార్టీలు యూపిఏలో భాగమన్నారు. ప్రజలు అభివృద్దిని కోరుకొంటున్నారని విపక్షాలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. అమాయకులకు శిక్షపడరాదని చెప్పారు. సత్యంబాబు కేసు విషయంలో పున:విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications