చంద్రబాబుకు డాక్టరేట్ ప్రకటించిన అమెరికా యూనివర్సిటీ మూసివేత
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు డాక్టరేట్ ప్రకటించిన చికాగో స్టేట్ యూనివర్సిటీ (సిఎస్‌యు) మూతబడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విశ్వవిద్యాలయాన్ని మూసివేస్తున్నట్లు వర్సిటీ అధ్యక్షుడు డాక్టర్ థామస్ ప్రకటించారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ విశ్వవిద్యాలయమే గతంలో డాక్టరేట్ ప్రకటించింది. చంద్రబాబుకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు వర్సిటీ ప్రతినిధులు గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన వెల్లడించారు.

అమెరికాలో చికాగో యూనివర్సిటీ ఒకటి, చికాగో స్టేట్ యూనివర్సిటి మరొకటి ఉన్నాయి. చికాగో యూనివర్సిటీ పేరున్నది. చికాగో స్టేట్ యూనివర్సిటీనే చంద్రబాబుకు నాడు డాక్టరేట్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
1867లో చిన్న స్కూలుగా ప్రారంభమైన చికాగో స్టేట్ యూనివర్సిటీ క్రమేణా ఈ స్థాయికి చేరుకుంది. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు నిర్వహిస్తున్నారు.
అయితే, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పోటీలే లేకపోవడంతో ఈ యూనివర్సిటీ ప్రమాణస్థాయి వేయికి పైగా ర్యాంకుకు దిగజారింది. దాంతో అటు అమెరికా ప్రభుత్వం, ఇటు ఇల్లినాయిస్ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదట. దీంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో మూసివేస్తున్నట్లు ప్రకటంచారు.












Click it and Unblock the Notifications